- District News
- మానవత్వంతో ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా
మానవత్వంతో ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులునల్ల మనోహర్ రెడ్డి
Published On
By Ram Reddy
పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఆగస్టు 20 (లోకల్ గైడ్)
మూడు రోజుల క్రితం గంగా స్నానానికి వెళ్లి తిరిగి వస్తుండగా బసంత్‌నగర్ రహదారిపై లారీ ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో చికురాయి గ్రామానికి చెందిన పినకాశి సతీష్, స్వప్న, విక్కి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి వైద్య చికిత్సకు భారీగా ఖర్చు అవుతున్న విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్ల మనోహర్ రెడ్డి మానవతా దృక్పథంతో ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.50,000 ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా, ఇకముందు కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 20:45:39
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
