- District News
- Khammam
- కాంగ్రెస్ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు
కాంగ్రెస్ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇన్‌చార్జ్ గ్రంథి ప్రవీణ్, వైరా నియోజకవర్గ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇన్‌చార్జ్ ఆత్మకూరి శేషగిరిరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను పురస్కరించుకుని ఆనందం వ్యక్తం చేశారు.
