- District News
- సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
నియోజకవర్గ సమస్యలు,అభివృద్ధి అంశాలపై చర్చ...
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన పలు ముఖ్యమైన సమస్యలు,ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు,నియోజకవర్గ అభివృద్ధికై తీసుకోవాల్సిన పలు అవసరమైన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ముఖ్యంగా నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధి,రహదారులు,తాగునీరు,విద్య,వైద్యం,ఉపాధి,పట్టణాభివృద్ధి తదితర అంశాలపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు.అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుండి అవసరమైన నిధులు,ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు,కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి,ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే ఆయనకు వివరించారు.నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి,వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.ఎమ్మెల్యే వివరించిన అంశాలను సానుకూలంగా పరిశీలించి,ప్రజల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
