- District News
- ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, అర్హత కలిగిన వారికి బెస్ట్ అవైలబుల్, ఉన్నత విద్య అమల...
ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, అర్హత కలిగిన వారికి బెస్ట్ అవైలబుల్, ఉన్నత విద్య అమలు,
ఎస్సీ,ఎస్టీల కేసుల పరిష్కారంలో వేగవంతంగా చర్యలు,
లోకల్ గైడ్ సెప్టెంబర్ 03 మహబూబాబాద్
జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో కమిటీ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు హాజరయ్యారు.
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం (POA Act) కింద నమోదైన కేసుల పురోగతి, బాధితులకు అందాల్సిన పరిహారం, కేసుల దర్యాప్తుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,బాధితులకు తక్షణ సహాయం: ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందాల్సిన నష్టపరిహారం, పెన్షన్ , ఇతర సంక్షేమ ఫలాలను ఆలస్యం లేకుండా వెంటనే అందించాలని,రెవెన్యూ, పోలీస్, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి కేసుల పరిష్కార వేగాన్ని పెంచాలని ,క్షేత్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు , ఇతర అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారికి ప్రభుత్వం అందిస్తున్న చట్టపరమైన రక్షణలపై అవగాహన సదస్సులు నిర్వహించాలనీ, జిల్లాలో 51% ఎస్సీ ఎస్టీలు ల జనాభా ఉందని జనాభా ప్రాతిపదికన వారికి అందాల్సిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, సబ్సిడీ రుణాలు, కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేసిన అంగన్వాడీ పోస్టులు, తదితర విభాగాలలో ఆర్ఓఆర్ రోస్టర్ పాయింట్ కచ్చితంగా అమలు చేయాలని, కార్యాలయాలలో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలతో పాటు అన్ని వసతి గృహాలలో కచ్చితంగా పక్కా డైట్ మెనూ పాటించాలని, హాస్టల్ వెల్ఫేర్ అధికారులకు కేటాయించిన వసతి గృహాలలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు,
భూ సమస్యలు, అంబేద్కర్ ఓవర్సీస్ స్టడీ, బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్, కార్పొరేట్ ఇంటర్ విద్య తదితర పథకాలలో అర్హులైన వారికి కచ్చితంగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు, జిల్లాలో ప్రజావాణి కార్యక్రమాలలో ప్రత్యేకంగా న్యాయ సేవల కోసం కౌంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తద్వారా కూడా ఎస్సీ ఎస్టీ, అన్ని వర్గాల ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు,
కొత్తగా నియామకమైన కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో అన్ని పరిస్థితులను గమనిస్తూ ఉండాలని ఏమైనా సమస్యలు ఉంటే కమిటీ దృష్టికి తీసుకువచ్చి వెంటనే పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని సూచించారు, అందరూ అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని తెలిపారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ మాట్లాడుతూ వేగవంతమైన నమోదైన కేసుల్లో ఎస్డీపివో/డిఎస్పీ స్థాయి అధికారులు దర్యాప్తును నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, సంబంధిత న్యాయస్థానాల్లో సకాలంలో ఛార్జిషీట్ దాఖలు చేయాలని, నిష్పక్షపాత విచారణ: ప్రతి కేసులోనూ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు చట్టపరంగా తగిన న్యాయం జరిగేలా చూడాలనీ,ముందస్తు చర్యలు: సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని, ప్రతి మాసం జరిగే క్రైమ్ మీటింగ్లో ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ కేసుల గురించి చర్చించి వేగవంతంగా చర్యలు తీసుకుంటామన్నారు,
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రెవెన్యూ కె. అనిల్ కుమార్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హౌసింగ్ పీడీ పురుషోత్తం, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తిరుపతిరావు, కమిటీ సభ్యులు, గుగులోతు కిషన్ నాయక్, పంజా కల్పన, గొల్లపల్లి రజనీకాంత్, పులుసం పుష్పలత, గూగులోత్ దేశీ రామ్ నాయక్, పి.రాజేంద్రప్రసాద్, రజిత, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
