ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి 

మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  

Published On
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి 

 

 

బెల్లంపల్లి (లోకల్ గైడ్)


సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు.బెల్లంపల్లి మండలం తాళ్ల గురజాల గ్రామంలో 1000రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ,నీటి పారుదల రంగం,యూరియా,విద్యుత్,రైతుభరోసా,రైతుభీమా తదితర రంగాల్లో చేసిన విధ్వంసాలపై రైతు సదస్సు నిర్వహించారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు సుభిక్షంగా ఉన్న తెలంగాణ రైతాంగం,ప్రస్తుత రేవంత్ పాలనలో అట్టడుగు స్థాయికి దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు.33నెలల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4ఎకరాల రైతులకు1,02,000 రూపాయలు,రుణమాఫీ 2,00,000 రూపాయలు,వరి పంటకు బోనస్ క్వింటాలుకు 500రూపాయల చొప్పున ప్రతి ఎకరాకు12,500 రూపాయలు చొప్పున 6పంటలకు 75,000,రైతు కూలీలకు,కౌలు రైతులకు సంవత్సరానికి 12,000 చొప్పున 2 సంవత్సరాలకు 24,000,తదితర సంక్షేమ పథకాలు‌ రైతులకు బాకీ పడిన ప్రతీ రూపాయి వెంటనే రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా తెలంగాణ రైతాంగానికి ఎలాంటి ఆంక్షలు లేకుండా యూరియా,ఎరువులను పంపిణీ చేయాలని,పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి సాగునీరు,నాణ్యమైన విద్యుత్ అందించాలని,రైతుభీమా ప్రీమియాన్ని తక్షణమే చెల్లించాలని లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్ర రైతుల తరుపున తమ పోరాటాన్ని ఉద్యమంలా ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అనంతరం తాళ్ళగురిజాల గ్రామ మాజీ సర్పంచ్ గాజుల రంజిత  అనారోగ్యంతో చికిత్స‌ పొందుతున్న విషయం తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిలను తెలుసుకుని,ఆమెకు ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రైతులు,పలువురు ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు
    రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి 
సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం
స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
సెల్ఫ్ టీచింగ్‌తో సత్తా చాటిన విద్యార్థులు
ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, అర్హత కలిగిన వారికి బెస్ట్ అవైలబుల్, ఉన్నత విద్య అమలు,