- District News
- Hyderabad
- స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
తర్వాత వంతెనకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.
Published On
By Ram Reddy
హైదరాబాద్:
దీని ప్రారంభంతో గ్రేటర్ హైదరాబాద్‌లో మరో భారీ వంతెన అందుబాటులోకి వచ్చినట్లైంది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భాగ్యనగరంలో ఇప్పటికే అతి పొడవైన స్టీల్ వంతెన 2.3 కిలోమీటర్ల పొడవుతో ఇందిరాపార్కు నుంచి వీఎస్‌టీ వరకు ఉంది. తాజాగా సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిని 3.32 కి.మీ.ల పొడవుతో రూ.620 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ వంతెన చంచల్‌గూడ జైలు నుంచి సంతోష్ నగర్‌లోని యాదగిరి థియేటర్ వరకు ఉంది. కాగా, వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నాలుగు లేన్ల ఈ బ్రిడ్జి నిర్మాణానికి 2020లో శంకుస్థాపన జరిగింది.
ఈ వంతెన అందుబాటులోకి రావడంతో నల్లగొండ ఎక్స్ రోడ్డు నుంచి ఒవైసీ ఆస్పత్రి జంక్షన్ వరకు 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం లభించింది. కాగా, ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణించేందుకు 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతోంది. తాజాగా బ్రిడ్జి ప్రారంభంతో నగరవాసులకు ప్రయాణం సులభం కానుంది.. KP
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 20:45:39
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
