సెల్ఫ్ టీచింగ్‌తో సత్తా చాటిన విద్యార్థులు

Published On
సెల్ఫ్ టీచింగ్‌తో సత్తా చాటిన విద్యార్థులు

 

IMG-20260903-WA0390
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో గురువారం ముందస్తుగా నిర్వహించిన సెల్ఫ్ టీచింగ్ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవం ముందు రోజు సెలవు కావడంతో పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ముందుగానే నిర్వహించినట్లు యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పాఠశాల ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు, విభాగాధిపతులు, శారీరక విద్యా ఉపాధ్యాయులు, అటెండర్లు, మండల విద్యాశాఖాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి తదితర బాధ్యతలను చేపట్టారు. విద్యార్థి-ఉపాధ్యాయులు క్రమశిక్షణతో తరగతులను నిర్వహిస్తూ తోటి విద్యార్థులకు వివిధ సబ్జెక్టులపై పాఠాలు బోధించారు. చక్కటి ప్రణాళికతో బోధనా నైపుణ్యాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలకు అనుగుణంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు ఉపాధ్యాయ వృత్తిపై గౌరవాన్ని పెంచుతుందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. ఉత్తమంగా పాఠాలు బోధించిన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించింది. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు
    రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి 
సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం
స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
సెల్ఫ్ టీచింగ్‌తో సత్తా చాటిన విద్యార్థులు
ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, అర్హత కలిగిన వారికి బెస్ట్ అవైలబుల్, ఉన్నత విద్య అమలు,