ఆత్కూరులో 'ఇందిరమ్మ ఇళ్లు' రచ్చ రచ్చ

​సర్పంచ్, గ్రామ కమిటీ తీర్మానించిన అర్హుల జాబితా గల్లంతు ​మండల స్థాయిలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడి చక్రం.. మా వాళ్లకే ఇవ్వాలంటూ పట్టు

​సర్పంచ్ వర్సెస్ కాంగ్రెస్ నేతలు.. అర్హులైన పేదల్లో ఆందోళన ​
Published On
ఆత్కూరులో 'ఇందిరమ్మ ఇళ్లు' రచ్చ రచ్చ

 

 


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం క్షేత్రస్థాయిలో రాజకీయ వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది.  మధిర మండలం ఆత్కూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదమైంది. 

అర్హులకు ఇళ్లు కేటాయించాలన్న లక్ష్యం పక్కదారి పట్టి, గ్రామ సర్పంచ్ వర్గానికి, కాంగ్రెస్ గ్రామ శాఖ నాయకత్వానికి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు గ్రామంలో రాజకీయ వేడిని రాజేసింది.


​గ్రామంలోని నిరుపేదలు, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ నేతృత్వంలో గ్రామ కమిటీ సమావేశమై లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసింది.

 నియమనిబంధనల ప్రకారం అర్హులను గుర్తించి, గ్రామ కమిటీ తీర్మానం ద్వారా ఒక జాబితాను ఫైనల్ చేసి అధికారులకు నివేదించేందుకు సిద్ధం చేశారు.గ్రామ కమిటీ ఆమోదించిన జాబితాను పూర్తిగా పక్కనబెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి.

 కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇందులో జోక్యం చేసుకుని, సర్పంచ్ రూపొందించిన జాబితాలో గత బీఆర్ఎస్  పార్టీకి చెందిన వారి పేర్లే ఎక్కువగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. గ్రామ కమిటీ జాబితాను కాదని, తాము ప్రతిపాదించిన వ్యక్తులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలంటూ మండల స్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తూ చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.

​
​అధికార పార్టీ నేత తీరుపై సర్పంచ్, గ్రామ కమిటీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయం చూడకుండా గ్రామంలో నిజమైన నిరుపేదలను గుర్తించి లిస్టు తయారు చేస్తే, పార్టీల రంగు పులిమి అర్హులకు అన్యాయం చేయడం తగదని సర్పంచ్ వర్గం వాదిస్తోంది.

 
​ఎవరికి ఇళ్లు వస్తాయో తెలియక అసలైన పేదలు, గుడిసెల్లో కాలం వెళ్లదీస్తున్న లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, రాజకీయ ప్రమేయం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు దక్కేలా చర్యలు తీసుకోవాలని ఆత్కూరు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


​

Tags:

About The Author

Latest News

హకీంపేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో ఏర్పాట్ల పరిశీలన.. హకీంపేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో ఏర్పాట్ల పరిశీలన..
        లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి / కొడంగల్: హకీంపేట్‌లో త్వరలో జరగనున్న వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో ఏర్పాట్లను ఉన్నతాధికారులు పరిశీలించారు. అదేవిధంగా కొడంగల్‌లో
ఐటీసీ నుంచి భద్రాచలం బ్రిడ్జి వరకు రహదారి సుందరీకరణకు వారం రోజుల్లో ప్రణాళిక
ధారూర్ నూతన ఎస్‌ఐగా సురేష్ బాధ్యతల స్వీకరణ
ఎస్సై, పోలీస్ ఉచిత శిక్షణకు 100 మంది గిరిజన అభ్యర్థుల ఎంపిక
పేదల జీవితాలకు కొత్త వెలుగు.. డాక్టర్ బాదావత్ రవి సేవా సంకల్పం!
సింగరేణిలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన సారథుల ఎంపిక
గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలే లక్ష్యం