ఆర్ టి సి ఎన్నికలలో ఎంప్లాయిస్ కూటమిని గెలిపించండి.  

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహ రెడ్డి.

Published On
ఆర్ టి సి ఎన్నికలలో ఎంప్లాయిస్ కూటమిని గెలిపించండి.   

 

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.

 

ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగే ఆర్టీసీ ఎన్నికలలో ఎంప్లాయిస్ యూనియన్ కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు పల్లా నరసింహారెడ్డి పిలుపునిచ్చారు .శనివారం దేవరకొండ డిపో వద్ద ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్టీసీ పరిరక్షణ కోసం కార్మికుల సంక్షేమ కోసం ఎంప్లాయిస్ యూనియన్ గెలవాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. కార్మిక హక్కుల కోసం నిరంతరం ఏఐటియుసి ఎర్రజెండా పోరాడుతుందని అన్నారు.ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాబు,  టి ఎమ్ యు రాష్ట్ర కార్యదర్శి థామస్ రెడ్డి,ఏఐటియుసి రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పల్లా దేవేందర్ రెడ్డి. ఎన్ ఎమ్ యు  రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి ఎస్ .రహిముద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ  గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈ యు – టి ఎమ్ యు – ఎన్ఎమ్ యు – జాక్ కూటమిని గెలిపించాలనీ ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం, కార్మికుల హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై కార్మికులు ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. బస్ డిపోల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆర్టీసీ కార్మికులను కలిసి కూటమికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన ఎన్నికలు కావడంతో ప్రతి కార్మికుడు బాధ్యతగా ఆలోచించి ఓటు వేయాలని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా నిలవాలని సూచించారు.
“కార్మికుల ఐక్యతే బలం – ఈ యు , టి ఎమ్ యు , ఎన్ ఎమ్ యు , జాక్ కూటమినే గెలిపిద్దాం”అన్నారు. ఎన్నికల ముందు ఆర్భాటం చేసి కార్మికులను ప్రలోభాల గురిచేసి ఎన్నికల తర్వాత కనుమరుగయ్యే నాయకుల గురించి జాగ్రత్తగా ఆలోచించి ఈ ఎన్నికల్లో వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఏ పార్టీ ఉన్న కార్మికుల హక్కుల కోసం కొట్లాడి సాధించే సంఘాలు మనవి అని అన్నారు. రాష్ట్ర గుర్తింపులో బస్సు గుర్తుకు నల్లగొండ స్థానిక గుర్తింపులో నిచ్చెన గుర్తుకు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో  సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూము బుచ్చిరెడ్డి, ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె ఎస్ రెడ్డి బి వెంకటయ్య, మంగ,జిల్లా అధ్యక్షులు జామాల్ గౌడ్ కార్యదర్శి  ఎన్ ఆర్ సి రాజు జాక్ నాయకులు డివి నారాయణ, రాఘవ రెడ్డి,హరి,జనార్దన్ రెడ్డి,o యాదయ్య, సీతారాం నాయక్, శ్రీనివాస్,సిపిఐ కార్యదర్శి మండల కార్యదర్శి దేప సుదర్శన్ రెడ్డి, ఎన్ రామస్వామి, పల్లా రంగా రెడ్డి,వి ఆంజనేయులు, వెంకట్రాములు, మల్లయ్య, దాస్, మైనుద్దీన్, కేస్యనాయక,ఉస్మాన్, మన్సూర్, యాదయ్య బారీములు, గోవర్ధన్ పాల్గొన్నవారు.

Tags:

About The Author

Latest News

కారేపల్లి బీసీ కాలనీలో దుర్గమ్మ వైభవం.. భక్తులకు అమ్మవారి దివ్య దర్శనం! కారేపల్లి బీసీ కాలనీలో దుర్గమ్మ వైభవం.. భక్తులకు అమ్మవారి దివ్య దర్శనం!
                కారేపల్లి, అక్టోబర్ 15 (లోకల్ గైడ్ న్యూస్): కారేపల్లి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన
కాంగ్రెస్‌కు దోచుకోవడమే తెలుసు.. పాలన చేతకాదు!.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని జరపకపోవడం విచారకరం!
వికారాబాద్‌లో ఆటోమేటెడ్ ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటుకై కలెక్టర్‌కు వినతిపత్రం:
ధాన్యం కొనుగోలుపై కేంద్రాల ఇన్చార్జులకు శిక్షణ
ప్రజల భద్రతకు పోలీసులతో కలిసి పనిచేయాలి
నర్సంపేటలో గోల్డ్ కంపెనీ సేల్స్‌మెన్‌కు షాక్.. రూ.5.50 లక్షలు ఎగవేత!