- District News
- వెంకటాపురం మండలంలో అక్రమ గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు – నలుగురు వ్యక్తులపై చట్టపర...
వెంకటాపురం మండలంలో అక్రమ గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు – నలుగురు వ్యక్తులపై చట్టపరమైన కేసులు
అక్రమ గుడుంబా తయారీ విక్రయం మరియు సరఫరాకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఎస్సై తిరుపతి రెడ్డి
ములుగు జిల్లా వెంకటాపురం (లోకల్ గైడ్ )
ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని సుడిబాక అటవీ ప్రాంతం మరియు బెస్తగూడెం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న నిషేధిత గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలతో కలిసి దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో అక్రమంగా నిర్వహిస్తున్న గుడుంబా తయారీ స్థావరాలను ధ్వంసం చేసి, అక్కడ లభించిన 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోవడంతో పాటు, సుమారు 4,000 లీటర్ల జాగరీ వాష్‌ను ధ్వంసం చేయడం జరిగింది.
అక్రమ గుడుంబా తయారీ స్థావరాలను నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను గుర్తించడం జరిగింది. వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
వెంకటాపురం మండల ప్రజలకు విజ్ఞప్తి
మీ గ్రామంలో ఎక్కడైనా అక్రమంగా గుడుంబా తయారీ విక్రయము లేదా సరఫరా జరుగుతున్నట్లు సమాచారం తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయగలరు సమాచారం అందించే వారి వివరాలు గుప్యంగా ఉంచబడతాయని అన్నారు సమాచారం తెలియజేయాల్సిన ఫోన్ నెంబర్ 8712670098
వెంకటాపురం పోలీస్ స్టేషన్ సమాచారం అందించగలరని పేర్కొన్నారు

ఈ దాడుల్లో సీఆర్‌పీఎఫ్ 39వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ ప్రశస్త్ , ఎస్ఐ తిరుపతిరెడ్డి, వెంకటాపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు 39 బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ బలగాలు పాల్గొన్నారు.
