ఘనపూర్ బ్రిడ్జి నిర్మాణంలో ప్రజాధనం వృథా  కాకూడదు

ఘనపూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఎండి. రహీమ్

Published On
ఘనపూర్ బ్రిడ్జి నిర్మాణంలో ప్రజాధనం వృథా  కాకూడదు

 

 

లోకల్ గైడ్ (మర్పల్లి) వికారాబాద్ జిల్లా బ్యూరో ప్రతినిధి :

మర్పల్లి మండల పరిధిలోని ఘనపూర్ గ్రామంలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో మంజూరైన బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రజాధనం వృథా కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామాధ్యక్షుడు ఎండి. రహీమ్ విజ్ఞప్తి చేశారు.
గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన ఈ బ్రిడ్జి నిర్మాణంపై ఇటీవల ఆయన ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్థానిక సర్పంచ్ స్పందిస్తూ, నిర్మాణ ప్రాంతం వద్ద తీసిన వీడియో ద్వారా మాట్లాడారు. "శ్రీ గడ్డం ప్రసాద్ గారి సహకారంతో రాబోయే 6 నెలల్లో ఈ బ్రిడ్జి పనులను పూర్తి చేయిస్తామని, బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడి చేతుల మీదుగానే దీనిని ప్రారంభింపజేస్తామని" సర్పంచ్ హామీ ఇచ్చారు. సర్పంచ్ స్పందనపై ఎండి. రహీమ్ హర్షం వ్యక్తం చేస్తూ, గ్రామాభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం కోసం బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తయి అందుబాటులోకి వస్తే ప్రజల పక్షాన తాను ఎంతో సంతోషిస్తానని తెలిపారు.
ఇంకుడు గుంతపై రోడ్డు నిర్మిస్తే ప్రమాదకరం:
ఇదే సమయంలో బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న ఒక ప్రధాన లోపాన్ని ఆయన అధికారులు, ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం బ్రిడ్జి కింది భాగంలో ఉన్న ఇంకుడు గుంతను పూడ్చుతున్నప్పటికీ, అది లోపలికి కుంగిపోతోందని తెలిపారు. కొట్టిచ్చిన ఇంకుడు గుంత అలా లోపలికి వెళ్తుంటే, అలాంటి బలహీనమైన పునాదులపై రోడ్డు నిర్మించడం వల్ల భవిష్యత్తులో పెద్ద ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు అధికారులు ప్రజాధనాన్ని ఎలా వృథా చేస్తారని ఆయన ప్రశ్నించారు.
కాబట్టి సంబంధిత పంచాయతీ రాజ్ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలతో ఇంకుడు గుంత సమస్యను సరిచేసి సురక్షితంగా రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరారు.

Tags:

About The Author

Latest News

సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరా! సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరా!
        కారేపల్లి, నవంబర్ 5 (లోకల్ గైడ్ న్యూస్) :పేదలకు సొంతింటి కలను సాకారం చేయాల్సిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిబంధనలు పక్కదారి పడుతున్నాయని సింగరేణి మండలం
ఘనపూర్ బ్రిడ్జి నిర్మాణంలో ప్రజాధనం వృథా  కాకూడదు
మేకలతండా నిందితుడికి ఐదేళ్ల నాటి కేసులో శిక్ష ఖరారు!
వికారాబాద్‌లో ముందే వేడెక్కిన 'పటాకుల' వేలం!
ఎంపీ రఘురాం రెడ్డి సహకారం.. సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్ చొరవతో గోవింద్ తండాకు తాగునీటి బోరు!
దివ్యాంగుల కోసం బస్ పాస్ మేళా.. 40 దరఖాస్తుల స్వీకరణ.
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే బీఎంఆర్ - కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం.