- District News
- Khammam
- డ్రైనేజీ మరిచారు.. ప్రజలను ముంచారు!
డ్రైనేజీ మరిచారు.. ప్రజలను ముంచారు!
టేకులపల్లి బజారులో సీసీ రోడ్డుపై మోకాటిలోతు నీరు.. నాట్లు వేసి గ్రామస్తుల నిరసన
Published On
By Ram Reddy
మండలంలోని ఎర్రబోడు గ్రామంలోని టేకులపల్లి బజారులో డ్రైనేజీ వ్యవస్థ లేక సీసీ రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే మోకాటిలోతు నీరు చేరుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇటీవల సీసీ రోడ్డు నిర్మించినప్పటికీ వర్షపు నీరు వెళ్లేందుకు డ్రైనేజీ సౌకర్యం కల్పించకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుత వర్షాలతో రోడ్డంతా నీటితో నిండిపోయి మడుగును తలపిస్తోంది. ఈ సమస్యపై పంచాయతీ అధికారులు స్పందించకపోవడంపై నిరసనగా గ్రామస్తులు సీసీ రోడ్డుపైనే నాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి వర్షపు నీరు నిలిచిపోకుండా శాశ్వత పరిష్కారం చూపాలని టేకులపల్లి బజారు ప్రజలు కోరుతున్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
05 Oct 2026 20:48:32
ఏర్పాట్లను పరిశీలించిన యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఇనపనూరి ప్రభాకర్
