జమ్మలపల్లిలో ఘనంగా వినాయక పూజలు.. దర్శించుకున్న వార్డు కౌన్సిలర్ కొరివి రజిత, నాయకులు

Published On
జమ్మలపల్లిలో ఘనంగా వినాయక పూజలు.. దర్శించుకున్న వార్డు కౌన్సిలర్ కొరివి రజిత, నాయకులు

 

 IMG-20260922-WA0284

మహబూబాబాద్ జిల్లా 
జమ్మలపల్లి:
గ్రామంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని స్థానిక 3వ వార్డు కౌన్సిలర్ కొరివి రజిత లింగస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 2వ వార్డు అధ్యక్షులు అంబాలా గోవర్ధన్, 3వ వార్డు అధ్యక్షులు మారగాని సురేష్ గౌడ్, గడ్డం శివ గౌడ్, యాసరపు చందు గౌడ్, కర్పూరపు నరేష్ తదితరులు పాల్గొని గణనాథుడికి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు
        వికారాబాద్ (లోకల్ గైడ్) జిల్లా బ్యూరో : అనంతగిరి హిల్స్‌లోని హరిత రిసార్ట్‌లో 'అవంతిక కన్స్ట్రక్షన్స్' ఆధ్వర్యంలో నిర్వహించిన 5, 16, మరియు 32 కిలోమీటర్ల
ఖమ్మం ఫోటోగ్రాఫర్‌ ముత్యాల నాగేశ్వరరావుకు జాతీయ కీర్తి!
వికారాబాద్ జిల్లా కేంద్రం లో మాతా శిశు ఆసుపత్రి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని, కాంట్రాక్ట్ రద్దు చేయాలి: 
_మాదిగ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి
అక్టోబర్ 6న ఛలో హైదరాబాద్
సినీ దర్శకుడు శ్రీనివాసరావు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య. 
అక్టోబర్‌ 8న ఆర్టీసీ ఎక్స్‌ రోడ్‌  బస్ భవన్‌ ఎదుట ధర్నా పోస్టర్లు ఆవిష్కరణ దివ్యాంగులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించాలి