ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.

పల్లెపహాడ్‌లో పోస్టర్ ఆవిష్కరించిన వ్యవసాయ కూలీలు.

Published On
ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.

 

 

 


నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి  . లోకల్ గైడ్ .

    రైతులు, వ్యవసాయ కూలీల హక్కుల కోసం జరిగే పోరాటాలను మరింత బలోపేతం చేయాలని, సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో ఖమ్మం నగరంలో నిర్వహించనున్న అఖిల భారత రైతు–కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జాతీయ 4వ మహాసభలను జయప్రదం చేయాలని పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పజ్జూరి ఉపేంద్ర, ఏఐకేఎంఎస్ జిల్లా కోశాధికారి పుట్ట సత్తయ్య లు పిలుపునిచ్చారు.నార్కట్‌పల్లి మండలం పల్లెపహాడ్ గ్రామంలో వ్యవసాయ కూలీల ఆధ్వర్యంలో ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పీ.ఓ.డబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పజ్జూరి ఉపేంద్ర, ఏ.ఐ.కే.ఎం.ఎస్ జిల్లా కోశాధికారి పుట్ట సత్తయ్య మాట్లాడుతూ, రైతులు, వ్యవసాయ కూలీలు నేడు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. వ్యవసాయ రంగ సంక్షోభం, కూలీలకు ఉపాధి కొరత, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.రైతులు, వ్యవసాయ కూలీల హక్కుల కోసం జరిగే పోరాటాలను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించి సంఘటిత ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు.ఖమ్మంలో సెప్టెంబర్ 28న నిర్వహించే బహిరంగ సభకు నల్లగొండ జిల్లా నుంచి రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చి జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏ ఐ కే ఎం ఎస్ నాయకులు, వ్యవసాయ కూలీలు తోడుసు జయ లక్ష్మి, మట్టిపెల్లి యాదమ్మ, పజ్జూరు పద్మ, బత్తుల అండమ్మా, సిరబోయిన కళమ్మ, ఖమ్మపాటి యల్లమ్మ, చంద్రయ్య, రాజయ్య, సుశీల, భద్రమ్మ, దోమల సోమమ్మ, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

గాంధీ జయంతి నాడు శ్రీచైతన్య స్కూల్ స్పెషల్ క్లాసులు: -  బిఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం గాంధీ జయంతి నాడు శ్రీచైతన్య స్కూల్ స్పెషల్ క్లాసులు: -  బిఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం
లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా బ్యూరో: వికారాబాద్ పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై టీఆర్‌ఎస్‌వీ (బిఆర్‌ఎస్‌వీ) జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి...
ప్రార్థించే పెదవుల్లో కన్నా సహాయం చేసే చేతులు మిన్న  - మానవత్వం 
దళిత నాయకుడి ఎదుగుదలను ఓర్వలేకే అక్రమ కేసులు
మహాత్ముడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శం
మహాత్మునికి ఘనమైన నివాళులు
ఘనంగా గాంధీ ,శాస్త్రీ ల జయంతి వేడుకలు
ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.