- District News
- జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికే టీజేఎంయూ పోరాటం
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికే టీజేఎంయూ పోరాటం
8న జరిగే అశ్వారావుపేట నియోజకవర్గ ప్రథమ మహాసభను విజయవంతం చేయండి
ఏర్పాట్లను పరిశీలించిన యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఇనపనూరి ప్రభాకర్
Published On
By Ram Reddy
జర్నలిస్టుల న్యాయమైన హక్కుల సాధనకు, వారి సంక్షేమానికి తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ ( టజేఎంయు) నిరంతరం అండగా నిలుస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఇనపనూరి ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈనెల 8వ తేదీన అశ్వారావుపేట పట్టణంలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్‌లో జరగనున్న టీజేఎంయూ అశ్వారావుపేట నియోజకవర్గ ప్రథమ మహాసభ ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానిక యూనియన్ ప్రతినిధులతో ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇనపనూరి ప్రభాకర్ మాట్లాడుతూ, దేశంలోనూ, రాష్ట్రంలోనూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘటిత శక్తే ఏకైక మార్గమన్నారు. రాష్ట్రంలో బలమైన సంఘాలుగా చెప్పుకుంటున్న పలు యూనియన్లు స్వార్థ ప్రయోజనాలు, వ్యక్తిగత కార్యకలాపాలకే ప్రాధాన్యతనిస్తూ జర్నలిస్టుల సమస్యలను విస్మరించాయని విమర్శించారు. ఫలితంగా నేటికీ పాత్రికేయుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సొంతింటి కలను కూడా నెరవేర్చుకోలేక జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా (ఎన్ యు జె ఐ) అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ పాత్రికేయుల గొంతుకగా నిలిచి రాజీలేని పోరాటాలు చేస్తుందని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో యూనియన్‌ను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, 8వ తేదీన ప్రథమ మహాసభకు అశ్వారావుపేట నియోజకవర్గంలోని పాత్రికేయులందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సామల ప్రవీణ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదయ రాఘవేంద్ర, ఖమ్మం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రణీత్ కుమార్, అశ్వారావుపేట నాయకులు నూనె హనుమంతరావు, పెనుగొండ సత్యనారాయణ, నార్లపాటి సుబ్బారావు, రాము తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
05 Oct 2026 20:48:32
ఏర్పాట్లను పరిశీలించిన యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఇనపనూరి ప్రభాకర్
