- District News
- ధారూర్‌లో గంజాయి అడ్డాలు మారిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు!
ధారూర్‌లో గంజాయి అడ్డాలు మారిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు!
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే ప్రభుత్వం జాప్యం చేస్తోంది -
పూర్తయిన ఇళ్లను వెంటనే అర్హులై పేదలకు కేటాయించాలి
- కాంగ్రెస్ నాయకులకు పేదవాల్లో కనిపించడం లేదా హెచ్చరించారు
వికారాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
Published On
By Ram Reddy

వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని ధారూర్ మండల కేంద్రంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను తక్షణమే అర్హులైన పేదలందరికీ కేటాయించాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. ధారూర్‌లోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయాన్ని ఆయన నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన 90 శాతం పనులు పూర్తయ్యాయని గుర్తుచేశారు. కేవలం మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడంలో ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఇళ్ల కేటాయింపులో కావాలని జాప్యం చేస్తున్నారని విమర్శించారు.
పాలకులు, అధికారుల అలసత్వం కారణంగా ఏళ్లుగా ఈ ఇళ్లు నిరుపయోగంగా పడి ఉన్నాయని, ఫలితంగా ఇవి మందుబాబులకు, గంజాయి బ్యాచ్‌లకు అడ్డాలుగా మారుతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ సంక్షేమ పథకాలను ఓర్వలేకనే దుష్ప్రచారం!
తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు పదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించాయని ఆనంద్ తెలిపారు. రైతు బంధు, దళిత బంధు, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు వంటి పథకాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్నే మార్చివేశాయని అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచి బాలింతలు, శిశువుల ఆరోగ్యానికి కేసీఆర్ కిట్ రక్షణగా నిలిచిందని, ఎస్సీ కుటుంబాల ఆర్థిక స్వాలంబన కోసం దళిత బంధు ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించామని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి ఎద్దడిని తీర్చడమే కాకుండా, మిషన్ కాకతీయతో ఆయకట్టును స్థిరీకరించామని గుర్తుచేశారు. కేసీఆర్ పథకాల ప్రజాదరణను చూడలేకనే విపక్షాలు, ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ వేణుగోపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు గయాజ్, స్థానిక సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
05 Oct 2026 20:48:32
ఏర్పాట్లను పరిశీలించిన యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఇనపనూరి ప్రభాకర్
