పట్టభద్రుల ఓటు నమోదుపై ఎమ్మెల్యే దొంతి సమీక్ష

Published On
పట్టభద్రుల ఓటు నమోదుపై ఎమ్మెల్యే దొంతి సమీక్ష

నర్సంపేట, అక్టోబర్ 05 (లోకల్ గైడ్):

రానున్న నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియపై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని, నమోదు ప్రక్రియకు అవసరమైన సమాచారం అందించి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో  పీసీసీ సభ్యులు పెండెం రామానంద్, పట్టణ అధ్యక్షులు పంబి వంశీ, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మొడెం ఎల్లగౌడ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రూపిక శ్రావణ్, వివిధ మండలాల యూత్ అధ్యక్షులు బండి హరీష్, సింగం ప్రశాంత్, పురుషోత్తం సురేష్, బొంత రంజిత్, ఎనగందుల రాజు, కొత్తకొండ రవివర్మ, ములుకల మనీష్, ఎస్.కె. షఫీ, భుక్య అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News