ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థకు రూ.2.00 కోట్ల గ్రంథాలయ

సెస్ నిధుల విడుదలకు మున్సిపల్ కమిషనర్ హామీ

Published On
ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థకు రూ.2.00 కోట్ల గ్రంథాలయ

ఖమ్మం :లోకల్ గైడ్ :

జిల్లా గ్రంథాలయ సంస్థకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వసూలు చేసిన గ్రంథాలయ సెస్ నిధులలో పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని విడుదల చేయాలని కోరుతూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ ఎం.డి. ఖాదర్ బాబా , కార్యదర్శి శ్రీమతి కె. కరుణ కుమారి, కార్యాలయ సిబ్బంది వి. అఖిల్, జె. భాస్కర్ రావులు ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలోని కేంద్ర, శాఖ మరియు గ్రామీణ గ్రంథాలయాల నిర్వహణకు గ్రంథాలయ సెస్ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నందున పెండింగ్ నిధులను విడుదల చేయడం అత్యవసరమని వివరించారు. గ్రంథాలయాల నిర్వహణ, పాఠకులకు మెరుగైన సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధుల అవసరాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
వినతిపై సానుకూలంగా స్పందించిన ఖమ్మం మున్సిపల్ కమిషనర్, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న గ్రంథాలయ సెస్ నిధులలో రూ.2.00 కోట్లను త్వరలోనే జిల్లా గ్రంథాలయ సంస్థ ఖమ్మం ఖాతాకు బదిలీ చేయనున్నట్లు హామీ ఇచ్చారు . మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన హామీ పట్ల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.డి. ఖాదర్ బాబా హర్షం వ్యక్తం చేస్తూ, గ్రంథాలయాల అభివృద్ధికి సహకరిస్తున్న మున్సిపల్ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

About The Author

Latest News