గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన సింగరేణి కార్మికుడు...

Published On
గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన సింగరేణి కార్మికుడు...

 


బెల్లంపల్లి (లోకల్ గైడ్)

 

బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్ 2ఇంక్లైన్ బస్తీకి చెందిన సింగరేణి కార్మికుడు,శాంతిఖని గనిలో ఎలక్ట్రీషియన్ గా విధులు నిర్వర్తిస్తున్న మంతెన భాస్కర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.ఫిబ్రవరి 2న హైదరాబాద్లోని జొరాస్ట్రియన్ క్లబ్ లో గిన్నిస్ బుక్ ప్రతినిధుల ఆధ్వర్యంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ సమన్వయంతో జరిగిన సంగీత కార్యక్రమంలో 22దేశాల నుండి సుమారు 2వేల మంది కీబోర్డు సంగీత వాయిద్యకారులు ఏకకాలంలో ప్రదర్శన నిర్వహించారు.అందులో అత్యద్భుతంగా ప్రతిభ కనపరచిన కొంతమందిని నిర్వాహకులు గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎంపిక చేశారు.వారిలో బెల్లంపల్లి పట్టణానికి చెందిన సింగరేణి కార్మికుడు మంతెన భాస్కర్ గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించడం విశేషం,ఆయనకు ఈనెల 29న హైదరాబాదులోని గచ్చిబౌలి విక్టరీ ఆడిటోరియంలో జరిగిన గిన్నిస్ అచీవర్స్ మీట్ కార్యక్రమంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టిన్ దండంగి,గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్,మెడల్ అందజేశారు.


కష్టాల్లోనుండి కార్మికుడిగా.

ఇష్టపడి కీబోర్డు ప్లేయర్ గా ఎదిగిన మంతెన భాస్కర్...

బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్ 2 ఇంక్లైన్ బస్తీకి చెందిన మంతెన రాజయ్య పోసమ్మ దంపతుల 3వ సంతానమే మంతెన భాస్కర్,అన్న రమేష్,అక్క రమ,తమ్ముడు సంజీవ్ లు ఉన్నారు.పదేళ్ల వయసులోనే1996లో తండ్రి రాజయ్య శాంతిఖనిలో గని ప్రమాదంలో మృతి చెందారు.అప్పట్నుండి తల్లి పోసమ్మే 4గురు పిల్లలను ధైర్యంతో పెంచి పెద్ద చేస్తు వచ్చింది.అన్న రమేష్ కు వారసత్వంగా తండ్రి ఉద్యోగం వచ్చింది.రమేష్ తన చెల్లెలు,ఇద్దరు తమ్ముళ్లకు తండ్రి స్థానంలో ఉండి తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి ఎన్నో కష్టాలు పడి చదివించాడు.ఎన్నో అవమానాలు ఆర్థిక ఇబ్బందులను దాటుకుంటు రమేష్ తన తల్లి సహకారంతో చెల్లెల్ని తమ్ముళ్లను ఏ లోటు లేకుండా చూసుకున్నారు.ఈ కష్టాల్ని,త్యాగాల్ని గమనిస్తు పెరుగుతూ వచ్చిన భాస్కర్ ఉన్నత విద్యను చదువుకొని సింగరేణి సంస్థ 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ లో ఎలక్ట్రిషియన్ గా  ఉద్యోగం సాధించాడు.2018లో శాంతిఖని గనిలో ఎలక్ట్రీషియన్ గా విధుల్లో చేరారు.2023లో సుప్రియను వివాహమాడారు.వీరికి కుమారుడు లియోనార్డో ఉన్నాడు.

గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిననందుకు కుటుంబసభ్యులు ఎంతగానో అభినంధించారు.ఆనందంలో కుటుంబసభ్యులు సంబారాలు చేసుకున్నారు.ఆయన పనిచేస్తున్న సింగరేణి సంస్థ ఉన్నత అదికారులు,శాంతిఖని గని అధికారులు,తోటి కార్మికులు,యూనియన్ నాయకులు,బంధువులు,మిత్రులు ప్రశంసించారు.

Tags:

About The Author

Latest News