స్నేహ సంఘాల ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ నిర్వహణ

ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Published On
స్నేహ సంఘాల ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ నిర్వహణ

 

 

కామారెడ్డి జిల్లా మే 30 లోకల్ గైడ్

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా మహిళా వారోత్సవాల లో భాగంగా 
గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ ఆధ్వర్యంలో సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్‌మెంట్ అండ్ హెల్త్ ఫర్ అడోలెసెంట్  కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్నేహ సంఘాల ద్వారా మాక్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువతలో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు మాక్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. విద్యార్థులు, యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
స్నేహ కార్యక్రమం ద్వారా కిశోర, కిశోరీలలో ఆరోగ్యం, పోషకాహారం, భద్రత, విద్య, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు. తమ సమస్యలను ధైర్యంగా వ్యక్తపరచడంతో పాటు సమాజాభివృద్ధికి తోడ్పడేలా యువత ముందుకు రావాలని సూచించారు.
మాక్ పార్లమెంట్‌లో పాల్గొన్న సభ్యులు విద్య, ఆరోగ్యం, బాల్య వివాహాల నిరోధం, మహిళా సాధికారత, పరిశుభ్రత తదితర అంశాలపై చర్చించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. 
కార్యక్రమంలో పాల్గొన్న యువతీ యువకులను కలెక్టర్ అభినందించి, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
అనంతరం
ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం
మహిళలను సన్మానించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ఉల్లాస్  కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో అక్షరాస్యత పరీక్షలు రాసిన మహిళలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, మహిళల అక్షరాస్యత కుటుంబం, సమాజ అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని అన్నారు. చదువుకోవాలనే సంకల్పంతో ముందుకు వచ్చి అక్షరాస్యత పరీక్షలు రాయడం అభినందనీయమని పేర్కొన్నారు.
జిల్లాలో ఉల్లాస్ ద్వారా  16331 మంది మహిళలు అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో పాల్గొని పరీక్షలు వ్రాసారని తెలిపారు.
విద్య ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగి కుటుంబ నిర్ణయాల్లో భాగస్వాములు కావడంతో పాటు సామాజిక, ఆర్థిక రంగాల్లో మరింత పురోగతి సాధించగలరని తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.
‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో పాల్గొని పరీక్షలు రాసిన మహిళల కృషిని కలెక్టర్ అభినందించారు. అనంతరం వారికి శాలువాలు, జ్ఞాపికలు అందజేసి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో  అడిషనల్ ఎస్ప  నరసింహ రెడ్డి, అదనపు కలెక్టర్ NV గిరి, drdo దామోదర్ రెడ్డి, DPM శ్రీనివాస్, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ అధికారులు, స్నేహ సంఘాల ప్రతినిధులు,  ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News