మదారి లక్ష్మి దశదిన కర్మల్లో పాల్గొన్న బడే నాగజ్యోతి

Published On
మదారి లక్ష్మి దశదిన కర్మల్లో పాల్గొన్న బడే నాగజ్యోతి

 

ఏటూరునాగారం : లోకల్ గైడ్ :
ములుగు నియోజకవర్గం ఏటూరునాగారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, పాక్ డైరెక్టర్ మదారి రామయ్య మాతృమూర్తి మదారి లక్ష్మి ఇటీవల మృతి చెందగా, వారి దశదిన కర్మలు శనివారం స్వగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి హాజరై లక్ష్మి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించిన బడే నాగజ్యోతి, "అధైర్యపడొద్దు.. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటుంది" అని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జగదీష్, కాకులమర్రి లక్ష్మణ్‌బాబు, మండల మాజీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్, సుబ్బుల సమ్మయ్య, జిల్లా నాయకుడు తుమ్మ మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ కోనేరు నాగేష్, మాజీ సర్పంచులు ఈసం రామ్మూర్తి, పూసం నరేష్ కుమార్, నాయకులు పూజారి కిషోర్, బక్కయ్య, ఆలం సురేష్, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News