- District News
- Khammam
- నారాయణ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
నారాయణ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ముఖ్య అతిథిగా డాక్టర్ కురపాటి ప్రదీప్ కుమార్
ఖమ్మం : లోకల్ గైడ్:నారాయణ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కురపాటి ప్రదీప్ కుమార్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు . ఖమ్మం నారాయణ విద్యా సంస్థల ఏ.జి.ఎం ఎస్ .రాంకీ , ఆర్. ఐ క్రాంతికుమార్ , కో ఆర్డినేటర్స్ ప్రవీణ్ కుమార్ , వినోద లక్ష్మి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు . ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు , సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు . స్వాతంత్ర్య సమరయోధులు , జాతీయ నాయకుల వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు . అలాగే పాఠశాలలో ఇన్వెస్టిటర్ సెర్మని నూతన స్కూల్ క్యాబినెట్‌ను ప్రకటించారు . హెడ్ బాయ్ , హెడ్ గర్ల్ , జూనియర్ హెడ్ బాయ్ , జూనియర్ హెడ్ గర్ల్ , డిప్యూటీ హెడ్ బాయ్ , డిప్యూటీ హెడ్ గర్ల్ పాటు అగ్ని , నాగ్ , పృథ్వి , త్రిశూల్ హౌస్‌లకు హౌస్ క్యాప్టెన్లను ఎంపిక చేశారు . ముఖ్య అతిథి డాక్టర్ కురపాటి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ , నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని భవిష్యత్తులో దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జి. నవీన్ కుమార్ , ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు . వేడుకలు దేశభక్తి , ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి .
