తెలంగాణ భావజాలానికి మార్గదర్శి  ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళి

Published On
తెలంగాణ భావజాలానికి మార్గదర్శి  ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళి

 


ఖమ్మం జిల్లా, కారేపల్లి ( సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగస్టు 6: సింగరేణి మండల పరిధిలోని రావొజీతండా గ్రామపంచాయతీ కార్యాలయంలో మహోన్నత విద్యావేత్త, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి, ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను శాస్త్రీయ ఆధారాలతో దేశవ్యాప్తంగా చాటి చెప్పి, తెలంగాణ ప్రజల్లో చైతన్యం నింపిన మహనీయుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలన్న ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ మహనీయుల ఆశయాలను కొనసాగించాలని కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బి. బాలు, పంచాయతీ కార్యదర్శి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఆశా కార్యకర్త, అంగన్‌వాడీ టీచర్, పాఠశాల విద్యార్థులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు.

Tags:

About The Author

Latest News

క్రైమ్ పార్టీ పోలీసులపై ఫిర్యాదు.. చర్యలేవి? క్రైమ్ పార్టీ పోలీసులపై ఫిర్యాదు.. చర్యలేవి?
రాజీ ప్రయత్నాలపై స్థానికుల్లో పలు అనుమానాలు.
కారేపల్లి ప్రజల సమస్యలపై పాలకవర్గం వెంటనే స్పందించాలి
సమతా మూర్తి స్పూర్తి కేంద్రం సామరస్యతకు  చిరునామా.  శ్రీ రామానుజుల సమానత్వ సందేశం నేటికీ సజీవం. ముచ్చింతల్‌లో సమతా మూర్తి స్పూర్తి కేంద్ర సందర్శన లో రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
టి న్యూస్ ఛానల్ రిపోర్టర్ పై దాడికి పాల్పడిన నిందితులపై
గద్దర్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి
వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి: డీఎంహెచ్‌వో డా. సీహెచ్. ధనరాజ్
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఆచార్య కొత్తపల్లి