కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, సుడా చైర్మన్ దుర్గాప్రసాద్

Published On
కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, సుడా చైర్మన్ దుర్గాప్రసాద్

 

ఖమ్మం జిల్లా వైరా ఆగస్టు 07: లోకల్ గైడ్:

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుపతి నుంచి కాలినడకన తిరుమల క్షేత్రానికి చేరుకున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్.. తన సతీమణి లలిత, కుమార్తెలు గాయత్రి, చందనలతో కలిసి స్వామివారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలాగే, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తన సతీమణి ఇందుమతితో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
దర్శన అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని వేడుకున్నట్లు తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, రైతులు, విద్యార్థులు, మహిళలు, యువత సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. వైరా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి మరింత అంకితభావంతో సేవ చేసే శక్తిని ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. వైరా ప్రజల ఆశీస్సులు, సహకారంతో నియోజకవర్గ పురోగతికి నిరంతరం కృషి చేస్తామని వారు వెల్లడించారు.

Tags:

About The Author

Latest News