హెచ్‌ఐవీ, ఎస్‌టీఐలపై అవగాహనతో పాటు సకాలంలో పరీక్షలు చేయించుకోవాలి.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ఇండియా ఫైట్స్ హెచ్‌ఐవీ అండ్ ఎస్‌టీఐ ప్రచార పోస్టర్‌ ఆవిష్కరణ* *గోప్యమైన స్వీయ అంచనా కోసం క్యూఆర్ కోడ్‌ వినియోగించుకోవాలి.

1097 జాతీయ ఎయిడ్స్ హెల్ప్‌లైన్‌ ద్వారా ఉచితంగా గోప్యమైన సహాయం పొందవచ్చు
Published On
హెచ్‌ఐవీ, ఎస్‌టీఐలపై అవగాహనతో పాటు సకాలంలో పరీక్షలు చేయించుకోవాలి.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ఖమ్మం, ఆగస్టు-17: లోకల్ గైడ్:

హెచ్‌ఐవీ, ఎస్‌టీఐలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటంతో పాటు, అనుమానం ఉన్నప్పుడు సకాలంలో పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సూచించారు.

హెచ్‌ఐవీ, లైంగికంగా సంక్రమించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, సకాలంలో పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించేందుకు చేపడుతున్న *ఇండియా ఫైట్స్ హెచ్ఐవి అండ్ ఎస్టీఐ*
ప్రచారంలో భాగంగా రూపొందించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డిలతో కలిసి సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* హెచ్‌ఐవీ లేదా ఎస్‌టీఐలకు సంబంధించి ఏవైనా సందేహాలు, అనుమానాలు ఉన్నవారు ఆలస్యం చేయకుండా తమ ఆరోగ్య పరిస్థితిపై అవగాహన పొందాలని సూచించారు. అవసరమైన వారు సకాలంలో పరీక్షలు చేయించుకుని, వైద్యుల సూచనల మేరకు తగిన చికిత్స, సేవలు పొందాలని తెలిపారు.

*క్యూఆర్ కోడ్ ద్వారా గోప్యమైన స్వీయ అంచనా*
జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) ఆధ్వర్యంలో *బ్రేక్ ఫ్రీ* ప్రచారంలో భాగంగా హెచ్‌ఐవీ, ఎస్‌టీఐలకు సంబంధించిన డిజిటల్ స్వీయ అంచనా సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అధికారిక ప్రచార పోస్టర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను మొబైల్ ఫోన్ కెమెరాతో స్కాన్ చేసి, వ్యక్తిగత ఆరోగ్యం, వ్యాధుల బారిన పడే ప్రమాదానికి సంబంధించిన సులభమైన ప్రశ్నలకు గోప్యంగా సమాధానాలు ఇవ్వడం ద్వారా స్వీయ అంచనా చేసుకోవచ్చని వివరించారు.

స్వీయ అంచనా అనంతరం అవసరమైన నివారణ చర్యలు, ఆరోగ్య సంబంధిత మార్గదర్శకాలు, సమీపంలోని పరీక్షా కేంద్రాలు, ఇతర వైద్య సేవల వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు ఎలాంటి సంకోచం లేకుండా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

*1097 జాతీయ ఎయిడ్స్ హెల్ప్‌లైన్‌ ద్వారా సేవలు:*
హెచ్‌ఐవీ, ఎస్‌టీఐలకు సంబంధించిన సందేహాలు, సమాచారం లేదా సహాయం కోసం 1097 జాతీయ టోల్‌ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్‌లైన్‌ ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఈ సేవ ద్వారా గోప్యంగా, ఉచితంగా అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం పొందవచ్చని పేర్కొన్నారు.

హెచ్‌ఐవీ, ఎస్‌టీఐలపై అపోహలు, భయాలను తొలగించి ప్రజల్లో సరైన అవగాహన కల్పించేందుకు సంబంధిత శాఖలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు, డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్, వైద్యాధికారులు, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రాఖీతో సోదర భావం చాటిన విజయలక్ష్మి. రాఖీతో సోదర భావం చాటిన విజయలక్ష్మి.
లోకల్ గైడ్/తాండూర్:రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ విజయలక్ష్మి యాదవ్ ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలోని మినీ భూకైలాస్ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం...
_క్రీడలతో మానసిక ఉల్లాసం.. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం
హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు
Toxic Box Office Collection Day 3: తగ్గుతున్న కలెక్షన్లు.. వరల్డ్‌వైడ్‌గా యష్ ‘టాక్సిక్’ సాధించిందెంత?
Google Pixel Watch 5: AI ఆధారిత GPS టెక్నాలజీతో పిన్‌పాయింట్ లొకేషన్ ట్రాకింగ్! గూగుల్ మ్యాప్స్ 3D మోడల్స్, AI సహాయంతో బ్యాటరీ లైఫ్ తగ్గకుండా లొకేషన్ ఆక్యురేసీ
పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోర వైఫల్యం: మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు! | Pak vs Eng Test కౌంటీ క్రికెట్ స్థాయి కూడా లేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
నేపాల్‌ వరదలు: విదేశీ సహాయక బృందాలకు ఎట్టకేలకు అనుమతి