_క్రీడలతో మానసిక ఉల్లాసం.. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం

_ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం.. ప్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్లకు ‘మేజర్ ధ్యాన్ చంద్ ఎక్సలెన్స్ అవార్డు–2026’ ప్రదానం

Published On
_క్రీడలతో మానసిక ఉల్లాసం.. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం

 

కుత్బుల్లాపూర్ ఆగస్టు 30 (లోకల్ గైడ్ ప్రతినిధి)

క్రీడారంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు యువ క్రీడాకారులు, ఫిజికల్ డైరెక్టర్లు సమష్టిగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి పిలుపునిచ్చారు. క్రీడల ద్వారా యువతలో ప్రతిభను వెలికితీయడంతో పాటు రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆయన అన్నారు.జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మభూషణ్, ఒలింపిక్ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ క్రీడా ప్రపంచానికి ప్రధాన వేదికగా మారేలా క్రీడాకారులు ప్రతిభను చాటాలని సూచించారు. క్రీడారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.క్రీడలతో ఒత్తిడికి దూరంహైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ మాట్లాడుతూ.. క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చని అన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తూ క్రీడారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికల పురుషోత్తం మాట్లాడుతూ.. భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన క్రీడా దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ అని కొనియాడారు. ఆయన జీవితం, క్రీడా ప్రస్థానం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
తెలంగాణ క్రీడాకారులకు సహకారంక్రీడారంగంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత, మాజీ రంజీ క్రికెటర్ కె. సాయి బాబా మాట్లాడుతూ.. క్రీడా విద్యార్థులకు అందిస్తున్న సహాయ సహకారాలను వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె. దీప్లా తెలంగాణ క్రీడా విద్యార్థులు సాధించిన విజయాలను వివరించారు.
కార్యక్రమానికి ముందు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికిపూలమాలవేసిఘనంగానివాళులర్పించారు.ప్రతిభావంతులకు ‘మేజర్ ధ్యాన్ చంద్ ఎక్సలెన్స్ అవార్డు’క్రీడారంగానికి విశేష సేవలు అందించిన ప్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్లను ఈ సందర్భంగా ‘మేజర్ ధ్యాన్ చంద్ ఎక్సలెన్స్ అవార్డు–2026’తో సత్కరించారు. ప్రొఫెసర్ బి. సురేష్ కుమార్, డాక్టర్ కె. అనిత, డాక్టర్ సి. సందీప్ రెడ్డి, డాక్టర్ బట్టు వెంకన్న, డాక్టర్ బి.ఆర్. నేత, డాక్టర్ పుంజాల సుప్రియ, డాక్టర్ ఏ. సిద్ధార్థ, డాక్టర్ ఆర్. మురళి, మేజర్ డి. జయసుధ, మేజర్ కె.ఏ. శివప్రసాద్, పొటెల్ శ్రీనివాస్ యాదవ్ తదితరులకు ముఖ్య అతిథులు పూలమాల, శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో అవార్డులు ప్రదానం చేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గుర్తింపు పొందిన స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సాధుల మధుసూదన్, జంట నగరాల శ్రీ గుజరాతీ బ్రహ్మ సమాజ్ అధ్యక్షుడు తరుణ్ కుమార్ మేత, తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్, కార్యదర్శి డాక్టర్ మొహమ్మద్ అక్తర్ అలీ, చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ రవితేజ, సంస్థ కోఆర్డినేటర్లు జి. వేణుగోపాల్, కె. రవీందర్, సూర్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రాఖీతో సోదర భావం చాటిన విజయలక్ష్మి. రాఖీతో సోదర భావం చాటిన విజయలక్ష్మి.
లోకల్ గైడ్/తాండూర్:రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ విజయలక్ష్మి యాదవ్ ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలోని మినీ భూకైలాస్ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం...
_క్రీడలతో మానసిక ఉల్లాసం.. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం
హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు
Toxic Box Office Collection Day 3: తగ్గుతున్న కలెక్షన్లు.. వరల్డ్‌వైడ్‌గా యష్ ‘టాక్సిక్’ సాధించిందెంత?
Google Pixel Watch 5: AI ఆధారిత GPS టెక్నాలజీతో పిన్‌పాయింట్ లొకేషన్ ట్రాకింగ్! గూగుల్ మ్యాప్స్ 3D మోడల్స్, AI సహాయంతో బ్యాటరీ లైఫ్ తగ్గకుండా లొకేషన్ ఆక్యురేసీ
పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోర వైఫల్యం: మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు! | Pak vs Eng Test కౌంటీ క్రికెట్ స్థాయి కూడా లేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
నేపాల్‌ వరదలు: విదేశీ సహాయక బృందాలకు ఎట్టకేలకు అనుమతి