నేటి నుంచి మండల స్థాయిలోనూ ప్రజావాణి.

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

Published On
నేటి నుంచి మండల స్థాయిలోనూ ప్రజావాణి.

జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) ఆగస్టు 17
 ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలోనే కాకుండా నేటి నుంచి మండల స్థాయిలోనూ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 
మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీడీవోలు నోడల్ అధికారులుగా సంబంధిత మండలాల అన్ని శాఖల అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలపై ఆర్జీలను సమర్పించవచ్చన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులను సంబంధిత అధికారులు నిర్దేశిత సమయంలోగా పరిష్కరిస్తారన్నారు. ప్రజలు చిన్న చిన్న సమస్యలకే కలెక్టరేట్ వరకు రావాల్సిన అవసరం లేకుండా ఆయా మండలాల్లోనే ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. అన్ని శాఖల సంబంధిత మండలాధికారులు మండల స్థాయి ప్రజావాణికి సకాలంలో విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Tags:

About The Author

Latest News

హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు
  ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
Toxic Box Office Collection Day 3: తగ్గుతున్న కలెక్షన్లు.. వరల్డ్‌వైడ్‌గా యష్ ‘టాక్సిక్’ సాధించిందెంత?
Google Pixel Watch 5: AI ఆధారిత GPS టెక్నాలజీతో పిన్‌పాయింట్ లొకేషన్ ట్రాకింగ్! గూగుల్ మ్యాప్స్ 3D మోడల్స్, AI సహాయంతో బ్యాటరీ లైఫ్ తగ్గకుండా లొకేషన్ ఆక్యురేసీ
పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోర వైఫల్యం: మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు! | Pak vs Eng Test కౌంటీ క్రికెట్ స్థాయి కూడా లేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
నేపాల్‌ వరదలు: విదేశీ సహాయక బృందాలకు ఎట్టకేలకు అనుమతి
రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి:
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.