- District News
- రాఖీతో సోదర భావం చాటిన విజయలక్ష్మి.
రాఖీతో సోదర భావం చాటిన విజయలక్ష్మి.
రాఖీ పౌర్ణమి సందర్భంగా తాండూర్‌లో ఆత్మీయ వేడుకలు.
Published On
By Ram Reddy
లోకల్ గైడ్/తాండూర్:
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ విజయలక్ష్మి యాదవ్ ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలోని మినీ భూకైలాస్ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సోదరులందరికీ విజయలక్ష్మి రాఖీలు కట్టి సోదర భావాన్ని చాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. రాఖీ బంధం ద్వారా పరస్పర ఆప్యాయత, గౌరవం, సోదర భావం మరింత బలపడతాయని పేర్కొన్నారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో, సోదర భావంతో మెలగాలని ఆమె ఆకాంక్షించారు. రాఖీ కట్టిన సందర్భంగా సోదరులు కూడా విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Latest News
30 Aug 2026 10:12:46
లోకల్ గైడ్/తాండూర్:రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ విజయలక్ష్మి యాదవ్ ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలోని మినీ భూకైలాస్ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం...
