ఉపాధి హామీపై సింగరేణి సర్పంచుల కసరత్తు

గ్రామాల్లో పనుల గుర్తింపు.. కూలీలకు నిరంతర ఉపాధి కల్పించడమే లక్ష్యం

Published On
ఉపాధి హామీపై సింగరేణి సర్పంచుల కసరత్తు

 

 

కారేపల్లి (సింగరేణి ), సెప్టెంబర్ 26 (లోకల్ గైడ్ న్యూస్): ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో వికసిత గ్రామపంచాయతీ ప్రణాళికపై నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో సింగరేణి మండలానికి చెందిన గ్రామపంచాయతీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి ప్రణాళికతో పాటు ఉపాధి హామీ పనుల గుర్తింపు, గ్రామసభల నిర్వహణ, పనుల ప్రాధాన్యతపై అధికారులు అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీIMG-20260926-WA0093 పరిధిలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను సర్పంచులు క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటికి ప్రాధాన్యత క్రమం నిర్ణయించి గ్రామ ప్రణాళికలో చేర్చాలని అధికారులు సూచించారు. అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు ఉపాధి హామీ కూలీలకు నిరంతరం పని కల్పించేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి, ప్రజల నుంచి అభివృద్ధి, ఉపాధి హామీ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు, దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని అత్యవసరమైన పనులను ఎంపిక చేసి ప్రాధాన్యత క్రమంలో ప్రతిపాదించాలని తెలిపారు. గ్రామసభల్లో గుర్తించిన పనులను పంచాయతీ కార్యదర్శులతో కలిసి సర్పంచులు సిద్ధం చేసి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ద్వారా ఆమోదింపజేసేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఆమోదం పొందిన పనులు సకాలంలో ప్రారంభమయ్యేలా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఉపాధి హామీ కూలీలకు జీవనోపాధి కల్పించడంలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. డిప్యూటీ పంచాయతీరాజ్ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి, శిక్షణ నిపుణులు శిక్షణ అందించారు. కార్యక్రమంలో సింగరేణి మండల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు
            పెద్దపల్లి జిల్లా సెప్టెంబర్ 26 (లోకల్ గైడ్)సుల్తానాబాద్ పట్టణంలోనీ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు చాతరాజు రమేష్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ
ఉపాధి హామీపై సింగరేణి సర్పంచుల కసరత్తు
సూధనపల్లి పాఠశాలలో ఉచిత షూ, బెల్ట్ ల పంపిణి ..
మూసీ పునరుజ్జీవనం: ఒడ్డున వెలుగులు కాదు.. నదిలో స్వచ్ఛమైన నీరే నిజమైన ప్రగతి
అంబులెన్స్‌కూ అందని ఏజెన్సీ!
గురవయ్య కుటుంబానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పరామర్శ
టోనీ చొరవతో డ్రైనేజీకి మోక్షం!