- District News
- అనవసరంగా రెచ్చగొట్టొద్దూ.
అనవసరంగా రెచ్చగొట్టొద్దూ.
సోషల్ మీడియా వేదికగా నిరాధారమైన ఆరోపణలు మానుకోవాలి.
లోకల్ గైడ్ /తాండూర్:
పదే పదే సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న నిరాధారమైన ఆరోపణలను ఆర్బిఓఎల్ సిఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆరోపణలకు ఆధారాలు ఉంటే నిరూపించాలని, మరొకసారి అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.ఇందుకు సంబంధించి మంగళవారం తాండూర్ పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...తాను 30 ఏళ్ల నుంచి రైతులు, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ పనిచేస్తున్నానన్నారు.
కుల సంఘాలకు స్థలాల కేటాయింపునకు కృషి చేశానని, ఆర్బిఎల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా సుమారు 200 మందికి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించామని అన్నారు.రైతు పక్షపాతిగా పనిచేస్తూ అన్ని రకాలుగా రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. వరి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు.
పరిశ్రమకు సంబంధించిన అంశాల్లోనూ తాను ఎప్పుడూ ప్రజలకు, ముఖ్యంగా పరిశ్రమ సమీప గ్రామాల ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఒక వ్యక్తి మూడు సంవత్సరాల కాలం ఉద్యోగానికి రాకపోయినా జీతం ఇచ్చి ఆదరించామని స్పష్టం చేశారు.అదేవిధంగా
ఇసుక, మట్టి తరలింపు విషయంలోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. మునిసిపల్ ఎన్నికల సమయంలోనూ, ఇతర రాజకీయ అంశాల్లోనూ తనపై అనవసర ఆరోపణలు చేశారని అన్నారు.
ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, మిగిలిన రెండేళ్లలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తన భూమికి సంబంధించిన విషయాల్లోనూ అనవసరంగా ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ, ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
