- District News
- Nalgonda
- నాకు కండ్లు కనబడతలేవయ్యా అని ఒకరంటే..నీ వల్లే కండ్లు ఆపరేషన్ చేయించుకుంటున్నయ్యా అంటూ మరొక తల్లి ముర...
నాకు కండ్లు కనబడతలేవయ్యా అని ఒకరంటే..నీ వల్లే కండ్లు ఆపరేషన్ చేయించుకుంటున్నయ్యా అంటూ మరొక తల్లి మురిపెపు ముచ్చట.
మమ్మల్ని పెద్దకొడుకు లెక్క చూసుకుంటున్నవంటూ చనువుతో రాజ్ గోపాల్ రెడ్డి చేతిని తాకాలని ముడుతలు పడ్డ ప్రతి చేయి ఆరాటం.

తన మాత్రుమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద మునుగోడు నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా కంటి సమస్యలతో బాదపడొద్దనే సదుద్దేశంతో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలకు నియోజకవర్గ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది..ఇప్పటి వరకు 16 ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 12306 మందికి కంటి పరీక్షలు చేయించి 2673 మందికి కంటి ఆపరేషన్లు పూర్తి చేసి, 5522 మందికి కండ్ల జోళ్లు పంపిణీ చేశారు.
ఈరోజు 17 వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సంస్థాన్ నారాయణ్ పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు.ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి తన మాత్రుమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రారంబించారు.మొత్తం 5 కౌంటర్లలో కండ్లను పరీక్షించుకుంటున్న వ్రుద్దులను ,
మహిళలను ఆత్మీయంగా పలకరిస్తూ వైద్య శిబిరం జరుగుతున్నతీరును పరిశీలించారు.ఆపరేషన్లకు ఎంపికైన వుద్దులను వ్రుద్ద మహిళలను ఆత్మీయంగా పలకరిస్తూ నేనున్నానని భరోసా ఇచ్చారు.. ఒక వ్రుద్ద మహిళకు బీపీ పెరుగుతున్న తీరును చూసి ఆమెను కూర్చొబెట్టుకుని దగ్గరుండి పరీక్షలు చేయించారు..వైద్య శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం కల్పించి ప్రతి ఒక్కరు తిన్నారా లేదా అని దగ్గరుండి చూసుకున్నారు..ఈరోజు జరిగిన 17 వవిడత కంటి వైద్య శిబిరంలో 976 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 183 మంది కంటి ఆపరేషన్లకు ఎంపికయ్యారు..వీరిలో 111 మందిని వెంటనే హైదరాబాద్ లోని శంకరా కంటి ఆసుపత్రికి పంపించారు..ఫీనిక్స్ ఫౌండేషన్ , శంకరా కంటి ఆసుపత్రి వారి సహకారంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది.
