మధిరలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

ముఖం, చేతులపై రక్తపు మరకలు.. మృతిపై అనుమానాలు

ఖమ్మం నుంచి క్లూస్‌ టీమ్‌ రాక.. ఆధారాల సేకరణ
Published On
మధిరలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

 

 

 

 మధిర ఆగస్టు 11 : లోకల్ గైడ్:

మధిర–వైరా ప్రధాన రహదారిపై పీవీఆర్‌ కళ్యాణ మండపం సమీపంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. రహదారి పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు మృతుడి ముఖం, చేతులపై రక్తపు మరకలు కనిపించడంతో ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రమాదమా? లేక మరేదైనా కారణంతో మృతి సంభవించిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీసేందుకు ఖమ్మం నుంచి క్లూస్‌ టీమ్‌ను రప్పించిన పోలీసులు, సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. రూరల్‌ సీఐ మధు, టౌన్‌ సీఐ రమేష్, ఎస్‌ఐ నవిత సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడి ఆచూకీ, గుర్తింపుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.మృతుడి గుర్తింపు, మృతికి గల అసలు కారణం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Tags:

About The Author

Latest News

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌లో పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాలు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌లో పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాలు.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో చెన్నూరు రూరల్ సిఐ కృష్ణ,తాళ్ల గురజాల...
కెవిసిఎస్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
శ్రీ జయ శ్లోక (SJS) హై స్కూల్ లో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఖమ్మంలో ఘనంగా 'మై డ్రీమ్ ప్రాజెక్ట్స్' అధినేత వి. హరినాథ్ బాబు జన్మదిన వేడుకలు
టిజెఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ  ఖమ్మం ప్రెస్ క్లబ్ అట్టహాసంగా  స్వాతంత్ర్య  దినోత్సవ వేడుకలు 
నారాయణ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
శ్రీ జయ శ్లోక (SJS) హై స్కూల్ లో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు.