అనాథలైన చిన్నారులకు కాంగ్రెస్ అండ

బాధిత కుటుంబానికి 100 కిలోల బియ్యం అందజేసిన కాంగ్రెస్ నాయకుడు గుడిపూడి తిరుమలరావు

Published On

 

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఆగస్టు 6:

రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఇద్దరు చిన్నారుల కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు గుడిపూడి తిరుమలరావు దుబ్బ తండా గ్రామపంచాయతీ పరిధిలోని మేకల తండా గ్రామాన్ని సందర్శించి, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆంగోత్ రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

తండ్రిని కోల్పోయిన ఇద్దరు చిన్నారుల పరిస్థితిని చూసి చలించిన తిరుమలరావు, కుటుంబానికి వెంటనే 100 కిలోల బియ్యాన్ని అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. కుటుంబానికి ధైర్యం చెబుతూ, వారి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారుల భవిష్యత్తు కోసం అవసరమైన ప్రతి సహాయ సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉంటామని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇలాంటి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు

దుబ్బ తండా సర్పంచ్ ఆంగోత్ మత్రు, ఉప సర్పంచ్ భూక్యా నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు జక్కుల కుమార్, చెరుకూరి రామారావు, భూక్యా కబీర్, గుగులోత్ రవీందర్, బానోత్ హతియా, గుగులోత్ కిషన్, భూక్యా ఉమామహేష్, మాలోత్ దస్రు, బానోత్ శంకర్, భూక్యా గణేష్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

క్రైమ్ పార్టీ పోలీసులపై ఫిర్యాదు.. చర్యలేవి? క్రైమ్ పార్టీ పోలీసులపై ఫిర్యాదు.. చర్యలేవి?
రాజీ ప్రయత్నాలపై స్థానికుల్లో పలు అనుమానాలు.
కారేపల్లి ప్రజల సమస్యలపై పాలకవర్గం వెంటనే స్పందించాలి
సమతా మూర్తి స్పూర్తి కేంద్రం సామరస్యతకు  చిరునామా.  శ్రీ రామానుజుల సమానత్వ సందేశం నేటికీ సజీవం. ముచ్చింతల్‌లో సమతా మూర్తి స్పూర్తి కేంద్ర సందర్శన లో రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
టి న్యూస్ ఛానల్ రిపోర్టర్ పై దాడికి పాల్పడిన నిందితులపై
గద్దర్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి
వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి: డీఎంహెచ్‌వో డా. సీహెచ్. ధనరాజ్
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఆచార్య కొత్తపల్లి