- District News
- స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా, సృజనాత్మకంగా నిర్వహించాలి: కలెక్టర్ కె. హైమావతి
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా, సృజనాత్మకంగా నిర్వహించాలి: కలెక్టర్ కె. హైమావతి
సిద్దిపేట, ఆగస్టు 7(లోకల్ గైడ్):
జిల్లాలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా, సాంప్రదాయబద్ధంగా, సృజనాత్మకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఆగస్టు 15న సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే వేడుకలకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.వేడుకలకు హాజరయ్యే అతిథులు, విద్యార్థులు, ప్రజలు, మీడియా ప్రతినిధులకు సౌకర్యవంతమైన సీటింగ్, తాగునీటి సదుపాయం కల్పించాలని, ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వాన పత్రికలు పంపించాలని ఆదేశించారు. పోలీస్ పరేడ్, ముఖ్య అతిథి ప్రసంగం, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలను ప్రతిబింబించే శాఖల శకటాల ప్రదర్శన, స్టాళ్ల ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు.విద్యార్థులతో దేశభక్తి, సాంప్రదాయ పాటలపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, మున్సిపాలిటీ ద్వారా మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయడంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేడుకల్లో అధిక సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు పాల్గొనేలా ప్రచారం నిర్వహించాలని, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్, అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, డీఆర్వో నాగరాజమ్మ, ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
