ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.

ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ

Published On
ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.



ఖమ్మం, అక్టోబర్,8: లోకల్ గైడ్:

ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానెస్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన పెవిలియన్ గ్రౌండ్ నుండి డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యమాన్ని ఉద్దేశించి 
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ..

దేశంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీజేపీ ఏజెంట్ గా మారారని తీవ్రంగా విమర్శించారు. దేశవ్యాప్తంగా ఓట్ల దొంగతనం, ఓటర్ల జాబితా అవకతవకలు, ఈవీఎంలపై అనుమానాలకు ప్రధాన కారణం ఈ కమిషనరే అని అన్నారు. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఓటు చోరీకి పాల్పడుతున్న జ్ఞానేష్ కుమార్ ఆ పదవిలో ఉండడానికి అనర్హుడని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని రచించిన డా. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా కూటమి చివరి వరకు పోరాడుతుందని, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎల్లప్పుడూ ముందుంటాయని స్పష్టం చేశారు. పిలిచిన వెంటనే పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అర్బన్ జిల్లా అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి మాట్లాడుతూ - ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ తీరును ఎండగట్టారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, శాసనసభ మాజీ సభ్యులు కొండబాల కోటేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, మంత్రి పొంగులేటి క్యాంపు ఇంచార్జి తుమ్మూరు దయాకర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బానోత్ బాలాజీ నాయక్, రాష్ట్ర ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు వడ్డేబోయిన నరసింహారావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి యడ్లపల్లి సంతోష్ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ప్రజాస్వామిక వాదులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నాదర్గుల్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినీ మృతి.  నాదర్గుల్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినీ మృతి. 
కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే విద్యార్థిని మృతి, పలువురు విద్యార్థులకు గాయాలు.  కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలంటూ డిమాండ్,  భారీగా మోహరించిన పోలీసులు
గాదెపాడు గ్రామంలోని యాదవ బజారు వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!
గేట్ కారేపల్లి సద్దుల బతుకమ్మ వేడుకల్లో తోటకూరి పిచ్చయ్య దాతృత్వం!
వికారాబాద్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
షాద్ నగర్ బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు
రావిర్యాల లో వైభవంగా దుర్గాష్టమి ఉత్సవాలు.
కారేపల్లిలో ఎల్‌నినోపై అలర్ట్‌.. పొదుపు చర్యలకు సర్పంచుల సిద్ధం! రంజిత్ కుమార్