- District News
- Ranga Reddy
- షాద్ నగర్ బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు
షాద్ నగర్ బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు
యువకుల రాకతో కొత్తూరు మండలంలో కొత్త జోష్
( లోకల్ గైడ్ షాద్ నగర్ )
కొత్తూరు మండల రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.పార్టీల్లో చేరికలు, నాయకుల మంతనాలు, గ్రామస్థాయి రాజకీయ సమీకరణాలు కొత్త చర్చకు తెరలేపుతున్నాయి.ముఖ్యంగా పెంజర్ల గ్రామానికి చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ఆదివారం కాంగ్రెస్,ఇతర పార్టీని వీడి బీఆర్ఎస్లోకి చేరడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది!
పెంజర్ల నుంచి.. గులాబీ గూటికి..
ఇప్పటి వరకు కాంగ్రెస్,ఇతర పార్టీలతో కలిసి కొనసాగిన స్థానిక ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ వైపు అడుగులు వేశారు.దీంతో గ్రామ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. యువకుల కోరిక మేరకు ఉపసర్పంచ్ మామిడి శాంతన్ రెడ్డి,మరో ఎనిమిది మంది వార్డు సభ్యులతో సుమారు 100 మంది బీఆర్ఎస్లో పార్టీ గూటికి చేరారు.ఈ చేరిక కార్యక్రమం ఎమ్మెల్సీ నాగరి కుంట నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా కొనసాగింది.ఉపసర్పంచ్‌తో పాటు పలువురు వార్డు సభ్యులు ఒకేసారి పార్టీ మారడంతో గ్రామస్థాయిలో రాజకీయ లెక్కలు మారే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నవీన్ రెడ్డి స్వగృహంలో.. భారీ చేరికల సందడి..!
ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి స్వగృహం మొదల్లగూడలో చేరిక కార్యక్రమం ఘనంగా బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కొత్తూరు మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి నాయకులు,కార్యకర్తలు భారీగా తరలిరావడంతో కొత్తూరు గులాబీ మయంగా మారింది.అదే విదంగా పెంజర్ల గ్రామం నుంచి భారీ కాన్వాయ్‌తో ఏమ్మెల్సీ నవీన్ రెడ్డి స్వగృహంమునకు తరలిరావడంతో కొత్తూరు మండలంలో గులాబీ.. గర్జన వాతావరణం చోటుచేసుకుంది.

ఉప సర్పంచ్ శంతన్ రెడ్డి,వార్డ్ సభ్యులు వేదంతా చారి,ఎస్.కె అర్బాస్,మంద మాధవి శ్రీను,ఆకనపల్లి మాధవి సహదేవ్,రాముట్ల రాములు, మైబుజ్జి,రమాదేవి శేఖర్,యువకులు మంద శ్రీనివాస్,వనం జంగయ్య,పోచమోని శంకర్,రాముట్ల రాములు,దిమూల ప్రవీణ్,ఆకన్‌పల్లి శివ,పలుకుట శ్రీను,బురమోని రమేష్,బురిగల్ల ప్రశాంత్(నాని),తెలుగు మహేందర్,వెంకటాపురం అశోక్,కోట బీరయ్య,కుమ్మరి జంగయ్య,షేక్ జాంగిర్,షేక్ అప్రోజ్,షేక్ కాజా పాషా, ఎర్రోళ్ల నరసింహ,ఎర్రోళ్ల ప్రశాంత్,గూడబ్ రాజేష్, ఇర్రపల్లి శేఖర్,లింగారి సత్తిపాల్,మంగలి పవన్,కమ్మరి రాజు,కావలి నాని,ఇంద్రపల్లి శ్రీధర్,మంద జస్వంత్,మంద విష్ణువర్ధన్,ఈర్లపల్లి శ్రీధర్,రాముట్ల కార్తీక్,లుంగారి నాని,ఆకంపల్లి జై కిషోర్,దేశాల సురేష్,ఇక్కలగారి వినీత్,తలారి నాని,ఈర్లపల్లి శ్రీశైలం తదితరులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బ్యాగరి రాజు,విలేజ్ వైస్ ప్రెసిడెంట్ కొరట్ల రాములు, పోచయ్య,యువ నాయకుడు శివ చారి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
