- District News
- Nalgonda
- సినీ దర్శకుడు శ్రీనివాసరావు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య...
సినీ దర్శకుడు శ్రీనివాసరావు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య.
సినీరంగంలో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరణం పట్ల టి పి సి సి వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు చిత్రపరిశ్రమకు, భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.
వైవిధ్యమైన కథాంశాలను, వినూత్నమైన ఆలోచనలను తెరపై ఆవిష్కరిస్తూ తెలుగు సినిమాకు కొత్త దారులు చూపిన సృజనాత్మక దర్శకుడని స్మరించుకున్నారు. ప్రయోగాత్మకతకు పెద్దపీట వేస్తూ ఎన్నో చిరస్మరణీయ చిత్రాలను అందించిన సింగీతం శ్రీనివాసరావు తనదైన ముద్రను సినీ చరిత్రలో శాశ్వతంగా వేశారని అన్నారు.దర్శకుడిగానే కాకుండా రచయితగా,
ఆలోచనాపరుడిగా, సినిమా పట్ల అపారమైన ప్రేమతో పనిచేసిన కళాకారుడిగా ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.సింగీతం శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కొండేటి మల్లయ్య ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ కళాభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
