- District News
- 1000రోజుల ప్రజా పాలన పూర్తి సందర్భంగా సంబరాలు..
1000రోజుల ప్రజా పాలన పూర్తి సందర్భంగా సంబరాలు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం1000 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్ రావు నేతృత్వంలో ఘనంగా 1000 బైక్‌లతో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు.మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం నుండి
ప్రారంభమైన ఈ భారీ బైక్ ర్యాలీ బెల్లంపల్లి చౌరస్తా మీదుగా వెంకటేశ్వర టాకీస్,ఐబీ చౌరస్తా,సీసీసీ కార్నర్ చౌరస్తా వరకు ఉత్సాహభరితంగా సాగింది.ఈ ర్యాలీలో మంచిర్యాల శాసనసభ్యులు,మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొని కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్,కార్పొరేటర్ తూముల నరేష్,మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాలే రాయలింగు,సింగిల్ విండో వైస్ చైర్మన్ శ్రీపతి మల్లేష్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్,మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి,పలువురు కార్పొరేటర్లు,డివిజన్ అధ్యక్షులు,పట్టణ కమిటీ సభ్యులు,మైనారిటీ,యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
