కృష్ణాష్టమి వేడుకల్లో అలరించిన 'చిన్నారి కృష్ణులు'

సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన అవసరం  హెచ్‌ఎం పబ్బ రమేష్ గౌడ్.

Published On
కృష్ణాష్టమి వేడుకల్లో అలరించిన 'చిన్నారి కృష్ణులు'

 

  

వాజేడు,లొకల్ గైడ్ :
మండల పరిధిలోని చింతూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పబ్బ రమేష్ గౌడ్, ఉపాధ్యాయురాలు దొడ్ల సృజన ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధల వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారి కృష్ణుల నృత్యాలు, ఆటపాటలు ఆకట్టుకోగా, పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
అనంతరం హెచ్‌ఎం పబ్బ రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కల్పించడానికే పాఠశాలలో ఇటువంటి పండుగలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ఉపాధ్యాయురాలు దొడ్ల సృజనకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకలతో పాఠశాల ఆవరణలో పండగ వాతావరణం నెలకొంది.

Tags:

About The Author

Latest News

ఆధ్యాత్మిక భావంతో  అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ ఆధ్యాత్మిక భావంతో అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ
---------------------------------------పెద్దపల్లి,  సెప్టెంబర్-17:(లోకల్ గైడ్ )----------------------------------------సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలో  ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు,...
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం.
విఠాయిపల్లి యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
టేకులపల్లి ప్రభుత్వ పాఠశాలలో విషపూరిత నాగుపాము  ప్రత్యక్షం.
విమోచన పోరాట యోధులకు గుడిపూడి తిరుమల రావు జోహార్లు
వీధి వీధిలో విజ్ఞేశ్వరునికి ప్రత్యేక పూజల సందడి
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న జాలిగం రాకేష్