- District News
- Warangal
- డైస్,యు పి ఎచ్ సి, ఎస్ ఎన్ సి యు, ఎన్ ఆర్ సి ల సేవలపై డి ఎం ఎచ్ ఓ తనికి.
డైస్,యు పి ఎచ్ సి, ఎస్ ఎన్ సి యు, ఎన్ ఆర్ సి ల సేవలపై డి ఎం ఎచ్ ఓ తనికి.
అన్ని సూచికల్లో మెరుగైన పనితీరు సాధించాలని అధికారులకు ఆదేశాలు
పేషెంట్ సేఫ్టీ వారోత్సవాల భాగంగా ఎ ఎ ఎం తిమ్మాపూర్ లో ప్రతిజ్ఞ
Published On
By Ram Reddy
వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 18
(లోకల్ గైడ్ న్యూస్)
ఎస్ ఎన్ సి యు, ఎన్ ఆర్ సి యూనిట్లలో శిశువులు, పిల్లలకు అందుతున్న వైద్య సంరక్షణ, పోషకాహార సేవలు, ఫాలోఅప్, రిఫరల్ సేవలు, రికార్డుల నిర్వహణపై ప్రత్యేకంగా సమీక్షించారు. డైస్ లో ఆర్ బి ఎస్ కె ద్వారా రిఫర్ అయిన చిన్నారుల అభివృద్ధి సంబంధిత సమస్యలను ముందస్తుగా గుర్తించి, అవసరమైన స్క్రీనింగ్, చికిత్స, ఫాలోఅప్ సేవలు సమర్థవంతంగా అందించాలని సూచించారు.
యు ఎఫ్ డబ్లు సి లో మహిళలకు అందుతున్న ఆరోగ్య సేవలు, రికార్డుల నిర్వహణ, సేవల నాణ్యతను పరిశీలించారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన నిర్దేశిత లక్ష్యాలు, సూచికలను సాధించే విధంగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అధికారులకు సూచించారు.
ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం, రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించడం, సేవలలో ఎలాంటి లోపాలు లేకుండా చూడటం, లబ్ధిదారుల సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, డా. బి. రాజా రెడ్డి సిబ్బందికి ఆదేశించారు.
తదనంతరం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం తిమ్మాపూర్ ను సందర్శించారు. అక్కడి అందించు చున్న ఆరోగ్య సేవలను పర్యవేక్షించి పెర్ఫార్మెన్స్ ను పెంచుటకు సూచనలు చేశారు. పేషెంట్ సేఫ్టీ వారోత్సవాల లో భాగంగా అక్కడి సిబ్బంది, పేషెంట్ ల తో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి ( సి ఎచ్ ఐ/డిప్యూటీ డి ఎం ఎచ్ ఓ డా. ప్రకాష్, డి పి ఓ అర్చన తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
18 Sep 2026 19:18:48
ములుగు జిల్లా ఏటూరు నాగారం లోకల్ గైడ్
_ఏటూరునాగారం మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్ ఐటీఐ వెనుక నివాసం ఉంటున్న ఇర్పా సుజాత–నరేష్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్
