మాదారం పంచాయతీలో గాంధీ జయంతి సందడి

గాంధీ ఆశయాలపై సర్పంచ్ ఉమా నరేష్ ప్రసంగం.. గ్రామసభ నిర్వహణపై ప్రజలకు అవగాహన

Published On
మాదారం పంచాయతీలో గాంధీ జయంతి సందడి

 

 

కారేపల్లి, అక్టోబర్ 2 (లోకల్ గైడ్ న్యూస్):

సింగరేణి మండలం మాదారం గ్రామపంచాయతీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను సర్పంచ్ అజ్మీరా ఉమా నరేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అజ్మీరా ఉమా నరేష్ మాట్లాడుతూ గాంధీజీ సత్యం, అహింస సిద్ధాంతాలను ప్రజాజీవితానికి మార్గదర్శకంగా నిలిపారని అన్నారు.IMG-20261002-WA0051 స్వాతంత్ర్య ఉద్యమంలో సహాయ నిరాకరణ, విదేశీ వస్త్ర బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాల ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను నేటి తరం ఆచరించాలని సూచించారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రామసభలకు ప్రజలు హాజరై తమ సమస్యలు, అవసరాలు, అభివృద్ధి ప్రతిపాదనలను తెలియజేయాలని సర్పంచ్ కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామ అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని అన్నారు. సింగరేణి మండల ప్రజలకు గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజయ్, ఉపసర్పంచ్ బానోత్ లాలుమంగా, గ్రామ పెద్దలు కాసాని గుర్రం నరసింహ, కుర్ర శ్రీనివాసరావు, బట్టు నరసయ్య, తుమ్మూజు అజ్మీర రజిని, శారద, బాలాజీ, వి.భారతి, రామ్మూర్తి, బానోత్ నాగేష్, సౌందర్య, బానోత్ కోటేశ్వరరావు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నర్సంపేటలో గోల్డ్ కంపెనీ సేల్స్‌మెన్‌కు షాక్.. రూ.5.50 లక్షలు ఎగవేత! నర్సంపేటలో గోల్డ్ కంపెనీ సేల్స్‌మెన్‌కు షాక్.. రూ.5.50 లక్షలు ఎగవేత!
    నర్సంపేట క్రైమ్, అక్టోబర్ 14 - లోకల్ గైడ్ : నర్సంపేటలో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ సేల్స్‌మెన్‌నే బోల్తా కొట్టించి రూ.5.50 లక్షలు ఎగవేసిన ఘటన
వికారాబాద్ జిల్లాలో బార్ల కేటాయింపునకు  (అక్టోబర్ 16న) లాటరీ
కోటమైసమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు!
మంగలి తండాలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ ఉక్కుపాదం!
అర్హత కల్గిన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం.
పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలి.
గ్రామ అభివృద్ధి శిలాపలకాలపై వార్డు మెంబర్ ల పేర్లు నమోదు చేయాలి.