దళిత నాయకుడి ఎదుగుదలను ఓర్వలేకే అక్రమ కేసులు

తనకు సంబంధం లేని భూ వివాదంలోకి లాగడం వెనుక కుట్ర:

కరీంపూర్ మాజీ సర్పంచ్ సుందరి అనిల్ ఆగ్రహం - కాంగ్రెస్ నేతల దిగజారుడు రాజకీయంపై మండిపాటు.. సమగ్ర విచారణకు డిమాండ్
Published On
దళిత నాయకుడి ఎదుగుదలను ఓర్వలేకే అక్రమ కేసులు

 

 లోకల్ గైడ్ వికారాబాద్, కోట్‌పల్లి (జిల్లా బ్యూరో ప్రతినిధి):

తనకు ఎలాంటి సంబంధం లేని భూ వివాదంలోకి లాగి, అక్రమ కేసులు బనాయించి రాజకీయంగా దెబ్బతీయాలని కొందరు కుట్ర చేస్తున్నారని కరీంపూర్ మాజీ సర్పంచ్, మండల బీఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సుందరి అనిల్ తీవ్రంగా ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక దళిత నాయకుడిగా తాను ప్రజాక్షేత్రంలో ఎదుగుతున్న తీరును ఓర్వలేకనే ప్రత్యర్థులు తనపై బూటకపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
బూటకపు ఆరోపణలతో నిజాలను మార్చలేరు
భూ వివాదానికి సంబంధించి తనపై వస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని సుందరి అనిల్ స్పష్టం చేశారు. కేవలం రాజకీయ కక్షతోనే తన పేరును ఈ వివాదంలోకి నెడుతున్నారని విమర్శించారు. "బూటకపు ఆరోపణలను పదేపదే ప్రచారం చేసినంత మాత్రాన అవి నిజమైపోతాయా?" అని ఆయన ప్రశ్నించారు. చట్టంపై, న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.
సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు తేల్చాలి
ఈ వ్యవహారంపై పోలీసు మరియు రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని అనిల్ డిమాండ్ చేశారు. వివాదాస్పద భూమికి సంబంధించిన పత్రాలు, రికార్డులను పరిశీలించడంతో పాటు, ఇందులో ఉన్న సంబంధిత వ్యక్తుల పాత్రను క్షుణ్ణంగా తనిఖీ చేసి నిజానిజాలు తేల్చాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి
గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సరికాదని అనిల్ హితవు పలికారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ రాజకీయాలు చేయాలి తప్ప, వ్యక్తిగత కక్షలతో తప్పుడు ఆరోపణలు చేసి ఒక వ్యక్తి ప్రతిష్టను, సమాజంలో అతని గౌరవాన్ని దిగజార్చే ప్రయత్నాలు చేయడం తగదన్నారు.
చివరికి న్యాయమే గెలుస్తుంది
తనపై ఎన్ని కుట్రలు పన్నినా, తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ చివరికి వాస్తవాలే బయటకు వస్తాయని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని సుందరి అనిల్ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కొలేకనే ఇటువంటి చౌకబారు ఆరోపణలకు దిగుతున్నారని, ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News

గాంధీ జయంతి నాడు శ్రీచైతన్య స్కూల్ స్పెషల్ క్లాసులు: -  బిఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం గాంధీ జయంతి నాడు శ్రీచైతన్య స్కూల్ స్పెషల్ క్లాసులు: -  బిఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం
లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా బ్యూరో: వికారాబాద్ పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై టీఆర్‌ఎస్‌వీ (బిఆర్‌ఎస్‌వీ) జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి...
ప్రార్థించే పెదవుల్లో కన్నా సహాయం చేసే చేతులు మిన్న  - మానవత్వం 
దళిత నాయకుడి ఎదుగుదలను ఓర్వలేకే అక్రమ కేసులు
మహాత్ముడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శం
మహాత్మునికి ఘనమైన నివాళులు
ఘనంగా గాంధీ ,శాస్త్రీ ల జయంతి వేడుకలు
ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.