అర్హత కల్గిన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం.

బిజెపి జిల్లేడు చౌదరిగూడ మండల అధ్యక్షులు ఎదిర. రాజు.

ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదుపై పార్టీ కార్యకర్తలతో మండల కేంద్రంలో సమీక్ష సమావేశం.
Published On
అర్హత కల్గిన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం.

 



 

జిల్లేడు చౌదరిగూడెం.( లోకల్ గైడ్ )

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్న సందర్బంగా  అర్హత కలిగిన పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేసి, వారికి ఓటు హక్కు కల్పించే విదంగా బిజెపి కార్యకర్తలు పని చేయాలని జిల్లేడు చౌదరిగూడ బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రాజు పిలుపు నిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో మండల కేంద్రంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి ఇస్నాతి శ్రీనివాస్  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి అర్హత కలిగిన పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.పట్టభద్రుల ఓట్లను సమగ్రంగా నమోదు చేయించి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలోఎమ్మెల్సీ మండల కన్వీనర్ బోయ కుర్మయ్య, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నవీన్, కొందుర్గు అధ్యక్షులు లక్ష్మి కాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గొల్ల రాజు,విట్టల్ నాయక్,,యాదయ్య,లింగం యాదగిరి నరేష్ శ్రీధర్ రాజు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నర్సంపేటలో గోల్డ్ కంపెనీ సేల్స్‌మెన్‌కు షాక్.. రూ.5.50 లక్షలు ఎగవేత! నర్సంపేటలో గోల్డ్ కంపెనీ సేల్స్‌మెన్‌కు షాక్.. రూ.5.50 లక్షలు ఎగవేత!
    నర్సంపేట క్రైమ్, అక్టోబర్ 14 - లోకల్ గైడ్ : నర్సంపేటలో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ సేల్స్‌మెన్‌నే బోల్తా కొట్టించి రూ.5.50 లక్షలు ఎగవేసిన ఘటన
వికారాబాద్ జిల్లాలో బార్ల కేటాయింపునకు  (అక్టోబర్ 16న) లాటరీ
కోటమైసమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు!
మంగలి తండాలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ ఉక్కుపాదం!
అర్హత కల్గిన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం.
పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలి.
గ్రామ అభివృద్ధి శిలాపలకాలపై వార్డు మెంబర్ ల పేర్లు నమోదు చేయాలి.