వికారాబాద్ జిల్లాలో బార్ల కేటాయింపునకు  (అక్టోబర్ 16న) లాటరీ

వికారాబాద్ జిల్లా అబ్కారీ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి 

Published On
వికారాబాద్ జిల్లాలో బార్ల కేటాయింపునకు  (అక్టోబర్ 16న) లాటరీ

 

 

లోకల్ గైడ్,వికారాబాద్, వికారాబాద్ జిల్లా బ్యూరో :

వికారాబాద్ జిల్లాలోని పరిగి మరియు కొడంగల్ మున్సిపాలిటీల పరిధిలో నూతన బార్ & రెస్టారెంట్ల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా అబ్కారీ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఈ రెండు బార్ల లైసెన్సుల కోసం సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తులను స్వీకరించినట్లు ఆయన వెల్లడించారు. వచ్చిన దరఖాస్తుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
  పరిగి మున్సిపాలిటీ పరిధిలోని బార్‌కు: 36 దరఖాస్తులు
 కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని బార్‌కు: 27 దరఖాస్తులు
ఈ దరఖాస్తుదారులకు లాటరీ విధానం ద్వారా బార్లను కేటాయించే ప్రక్రియ అక్టోబర్ 16, 2026  నిర్వహించనున్నట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ( ఐ డి ఓ సి ) సమావేశ హాలులో, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ లాటరీ ప్రక్రియ జరగనుంది.
దరఖాస్తుదారులు గమనించవలసిన ముఖ్యాంశాలు:
  దరఖాస్తుదారులందరూ అక్టోబర్ 16వ తేదీ ఉదయం 9:30 గంటల కల్లా సమావేశ హాలుకు చేరుకోవాలి.
  దరఖాస్తుదారులు తమ వెంట తెచ్చిన మొబైల్ ఫోన్లను హాలు బయట డిపాజిట్ చేసి లోపలికి రావాలని కోరారు.
 ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఎంట్రీ పాస్‌ను వెంట తీసుకొని రావాలి.
ఈ ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే 8712658729 నెంబర్‌ను సంప్రదించాలని జిల్లా అబ్కారీ శాఖ అధికారి తెలిపారు.

Tags:

About The Author

Latest News

నర్సంపేటలో గోల్డ్ కంపెనీ సేల్స్‌మెన్‌కు షాక్.. రూ.5.50 లక్షలు ఎగవేత! నర్సంపేటలో గోల్డ్ కంపెనీ సేల్స్‌మెన్‌కు షాక్.. రూ.5.50 లక్షలు ఎగవేత!
    నర్సంపేట క్రైమ్, అక్టోబర్ 14 - లోకల్ గైడ్ : నర్సంపేటలో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ సేల్స్‌మెన్‌నే బోల్తా కొట్టించి రూ.5.50 లక్షలు ఎగవేసిన ఘటన
వికారాబాద్ జిల్లాలో బార్ల కేటాయింపునకు  (అక్టోబర్ 16న) లాటరీ
కోటమైసమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు!
మంగలి తండాలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ ఉక్కుపాదం!
అర్హత కల్గిన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం.
పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలి.
గ్రామ అభివృద్ధి శిలాపలకాలపై వార్డు మెంబర్ ల పేర్లు నమోదు చేయాలి.