- District News
- Ranga Reddy
- గ్రామ అభివృద్ధి శిలాపలకాలపై వార్డు మెంబర్ ల పేర్లు నమోదు చేయాలి.
గ్రామ అభివృద్ధి శిలాపలకాలపై వార్డు మెంబర్ ల పేర్లు నమోదు చేయాలి.
మండల వార్డు మెంబర్ ల ఫోరం అధ్యక్షులు రాజు నాయక్.
జిల్లేడు చౌదరిగూడెం ( లోకల్ గైడ్)
గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థాపించే శిలా పలకం పై సంబందిత మంత్రుల శాఖల స్థాయి నేతలు పేర్లు, అలాగే స్థానిక ప్రజా ప్రతినిధులైన పేర్లతో పాటు గ్రామ వార్డు మెంబర్ ల పేర్లను కూడ నమోదు చేయాలని మండల వార్డు మెంబర్ ఫోరం కమిటీ సభ్యులు, అలాగే మండల వార్డు మెంబర్ ల కమిటీ అధ్యక్షులు రాజు నాయక్ ఎంపిడిఓ పుష్పలత ను కోరారు. మంగళవారం మండల వార్డు మెంబర్ ల ఫోరం కమిటీ ఆధ్వర్యంలో
ఎంపిడిఓ కు వినతి పత్రాన్ని అందజేశారు.రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం వార్డు మెంబర్ లు ప్రజలు వేసిన ఓట్లతో గెలుపొందండం జరుగుతుందని గుర్తు చేశారు. స్థానిక ప్రజాప్రతి నిధులకు ఇచ్చే స్థాయి, వార్డు మెంబర్ లకు ఇవ్వడం లేదని వార్డు మొంబర్ ల కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. రాబోయే కాలంలో చేపట్టే అభివృద్ధి శిలా పలకాలపై వార్డు మెంబర్ ల పేర్లను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపిడిఓ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ ల మండల కమిటీ అధ్యక్షులు రాజు నాయక్,మండల వార్డు మెంబర్ ల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
