గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలే లక్ష్యం

ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో రాహుల్

చర్ల సీహెచ్‌సీకి రూ.5.60 లక్షలు, ములకలపాడు పీహెచ్‌సీకి రూ.70 వేల విలువైన వైద్య పరికరాలు
Published On
గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలే లక్ష్యం

 

 

 

భద్రాచలం, లోకల్ గైడ్ న్యూస్ : 
 గిరిజన, గిరిజనేతర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఐటీడీఏ నిధులతో చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రానికి (సీహెచ్‌సీ) రూ.5.60 లక్షల విలువైన వైద్య పరికరాలు, దుమ్ముగూడెం మండలం ములకలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్‌సీ) రూ.70 వేల విలువైన వైద్య పరికరాలను అందించినట్లు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. మంగళవారం చర్ల సీహెచ్‌సీలో ఆసుపత్రి పర్యవేక్షకుడు సాయి వర్ధన్‌కు పరీక్షల పడకలు, పరీక్షల కోసం ఫోకస్ లైట్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ప్రసూతి గదికి ఎయిర్ కండిషనర్ తదితర వైద్య పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. చర్ల ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అందుబాటులోకి వచ్చిన పరికరాలను సద్వినియోగం చేసుకుని రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్లు ప్రారంభం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు స్థానికంగానే వైద్య సేవలు పొందే అవకాశం కలిగిందన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను మరింత ముందుకు తీసుకెళ్తామని, ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయడంతో పాటు త్వరలో రోడ్డు నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం దుమ్ముగూడెం మండలం ములకలపాడు పీహెచ్‌సీకి రూ.70 వేల విలువైన వైద్య పరికరాలను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో బి.రాహుల్ అందజేశారు. ఐదు రకాల వైద్య పరికరాలతో పాటు ప్రసూతి సంబంధిత కిట్, బరువు కొలిచే యంత్రం, రక్తపోటు పరీక్షించే యంత్రాన్ని పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్ రుక్మాకర్ రెడ్డికి అందించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, వైద్య సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన వైద్య పరికరాలను అందించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సైదులు, డీసీహెచ్ రవిబాబు, ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

హకీంపేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో ఏర్పాట్ల పరిశీలన.. హకీంపేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో ఏర్పాట్ల పరిశీలన..
        లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి / కొడంగల్: హకీంపేట్‌లో త్వరలో జరగనున్న వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో ఏర్పాట్లను ఉన్నతాధికారులు పరిశీలించారు. అదేవిధంగా కొడంగల్‌లో
ఐటీసీ నుంచి భద్రాచలం బ్రిడ్జి వరకు రహదారి సుందరీకరణకు వారం రోజుల్లో ప్రణాళిక
ధారూర్ నూతన ఎస్‌ఐగా సురేష్ బాధ్యతల స్వీకరణ
ఎస్సై, పోలీస్ ఉచిత శిక్షణకు 100 మంది గిరిజన అభ్యర్థుల ఎంపిక
పేదల జీవితాలకు కొత్త వెలుగు.. డాక్టర్ బాదావత్ రవి సేవా సంకల్పం!
సింగరేణిలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన సారథుల ఎంపిక
గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలే లక్ష్యం