సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరా!

గంగారంతండాలో సర్పంచ్ కిరణ్ ఆగ్రహం.. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల ప్రతిపాదనలు చేశారంటూ ఆరోపణ.. కలెక్టర్‌కు ఫిర్యాదు

Published On
సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరా!

 

 

కారేపల్లి, నవంబర్ 5 (లోకల్ గైడ్ న్యూస్)

:పేదలకు సొంతింటి కలను సాకారం చేయాల్సిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిబంధనలు పక్కదారి పడుతున్నాయని సింగరేణి మండలం గంగారంతండా సర్పంచ్ కిరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించిన తీర్మానాలు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన గ్రామ సర్పంచ్‌కు కనీస సమాచారం ఇవ్వకుండా, ఆయన ప్రమేయం లేకుండానే ఇళ్ల ప్రతిపాదనలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గంగారంతండాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం చోటుచేసుకుంటోందని, అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోందని సర్పంచ్ ఆరోపించారు. గ్రామసభ తీర్మానాలు పారదర్శకంగా జరగాల్సి ఉండగా, సర్పంచ్ సంతకం లేకుండానే ఏడు ఇళ్లకు సంబంధించిన ప్రతిపాదనలు అధికారులకు పంపినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసి వివరించడంతో పాటు జిల్లా కలెక్టర్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తన ఫిర్యాదు మేరకు ప్రత్యేక విచారణ అధికారి అశోక్ పరిశీలన జరిపారని, ప్రతిపాదించిన ఏడు ఇళ్లలో నాలుగు ఇళ్లకు ఇప్పటికే డాబాలు ఉన్నట్లు గుర్తించి వాటిని తిరస్కరించినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిజమైన నిరుపేదలకు అందాల్సి ఉండగా, రాజకీయ పలుకుబడితో అనర్హులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు జరగడం బాధాకరమన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పేదలకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే న్యాయపోరాటానికి సైతం వెనుకాడబోనని సర్పంచ్ కిరణ్ స్పష్టం చేశారు.

Tags:

About The Author

Latest News

సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరా! సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరా!
        కారేపల్లి, నవంబర్ 5 (లోకల్ గైడ్ న్యూస్) :పేదలకు సొంతింటి కలను సాకారం చేయాల్సిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిబంధనలు పక్కదారి పడుతున్నాయని సింగరేణి మండలం
ఘనపూర్ బ్రిడ్జి నిర్మాణంలో ప్రజాధనం వృథా  కాకూడదు
మేకలతండా నిందితుడికి ఐదేళ్ల నాటి కేసులో శిక్ష ఖరారు!
వికారాబాద్‌లో ముందే వేడెక్కిన 'పటాకుల' వేలం!
ఎంపీ రఘురాం రెడ్డి సహకారం.. సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్ చొరవతో గోవింద్ తండాకు తాగునీటి బోరు!
దివ్యాంగుల కోసం బస్ పాస్ మేళా.. 40 దరఖాస్తుల స్వీకరణ.
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే బీఎంఆర్ - కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం.