మేకలతండా నిందితుడికి ఐదేళ్ల నాటి కేసులో శిక్ష ఖరారు!

మహిళపై లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసులో భూక్యా లచ్చిరాంకు మూడేళ్ల కఠిన కారాగారం.. రూ.10 వేల జరిమానా విధించిన ఖమ్మం కోర్టు

Published On
మేకలతండా నిందితుడికి ఐదేళ్ల నాటి కేసులో శిక్ష ఖరారు!

 

 

కారేపల్లి, నవంబర్ 5 (లోకల్ గైడ్ న్యూస్):

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ, బెదిరింపులకు గురిచేస్తే చట్టం నుంచి తప్పించుకోలేరని మరోసారి నిరూపితమైంది. మహిళపై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన కేసులో మేకలతండాకు చెందిన నిందితుడికి ఖమ్మం న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. కారేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మేకలతండాకు చెందిన భూక్యా లచ్చిరాం (42)పై 2019లో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు బెదిరింపులకు గురిచేసినట్లు క్రైమ్ నంబర్ 48/2019 కింద ఐపీసీ సెక్షన్లు 354, 506 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి, న్యాయస్థానంలో అవసరమైన ఆధారాలు, సాక్ష్యాలను సమర్పించారు. కేసు విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో ఖమ్మం మూడవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఏ. ప్రవీణ్ కుమార్ నిందితుడు A1 భూక్యా లచ్చిరాంకు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించారు. ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారిగా ఏఎస్ఐ బి. కృష్ణ ప్రసాద్, ప్రధాన దర్యాప్తు అధికారిగా పి. వెంకన్న సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించారు. కోర్టులో విచారణ సందర్భంగా పోలీసు అధికారులు సమన్వయంతో వ్యవహరించి నేర నిరూపణకు సహకరించారు. కేసు విచారణలో కీలకంగా సహకరించిన కోర్టు డ్యూటీ ఆఫీసర్ సీహెచ్. నాగేశ్వరరావు, ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ గాయత్రి, బ్రీఫింగ్ ఆఫీసర్ ఎస్ఐ పి. గోపి, లైజన్ అధికారి ఎస్ఐ కె. శ్రీకాంత్‌లను అడిషనల్ డీసీపీ రామానుజం అభినందించారు.

Tags:

About The Author

Latest News

సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరా! సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరా!
        కారేపల్లి, నవంబర్ 5 (లోకల్ గైడ్ న్యూస్) :పేదలకు సొంతింటి కలను సాకారం చేయాల్సిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిబంధనలు పక్కదారి పడుతున్నాయని సింగరేణి మండలం
ఘనపూర్ బ్రిడ్జి నిర్మాణంలో ప్రజాధనం వృథా  కాకూడదు
మేకలతండా నిందితుడికి ఐదేళ్ల నాటి కేసులో శిక్ష ఖరారు!
వికారాబాద్‌లో ముందే వేడెక్కిన 'పటాకుల' వేలం!
ఎంపీ రఘురాం రెడ్డి సహకారం.. సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్ చొరవతో గోవింద్ తండాకు తాగునీటి బోరు!
దివ్యాంగుల కోసం బస్ పాస్ మేళా.. 40 దరఖాస్తుల స్వీకరణ.
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే బీఎంఆర్ - కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం.