దివ్యాంగుల కోసం బస్ పాస్ మేళా.. 40 దరఖాస్తుల స్వీకరణ.

దివ్యాంగులకు కేటాయించిన సీట్లలో వారికే అవకాశం కల్పించాలి.

Published On
దివ్యాంగుల కోసం బస్ పాస్ మేళా.. 40 దరఖాస్తుల స్వీకరణ.

లోకల్ గైడ్/తాండూరు:
దివ్యాంగులకు ఆర్టీసీ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో బుధవారం తాండూరు ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సిములు ఆధ్వర్యంలో బస్ పాస్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన దివ్యాంగుల నుంచి 40 బస్ పాస్ దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాండూరు డిపో మేనేజర్ పరిటాల ప్రవీణ్ కుమార్‌కు, ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు కేటాయించిన సీట్లలో వారికే అవకాశం కల్పించేలా డ్రైవర్లు, కండక్టర్లకు తగిన సూచనలు ఇవ్వాలని కోరుతూ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్, బస్ పాస్ కంట్రోలర్ జగన్నాథం, వెంకటేశం, బస్ పాస్ సెక్షన్ ఇన్‌చార్జి శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, రాజు, ఎల్లప్ప మోహన్, ఖలీల్, సలీం పాషా, శంకర్, అహ్మద్, ప్రభాకర్ రెడ్డి, శ్రవణ్, నర్సిములు, దివ్యాంగులు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎంపీ రఘురాం రెడ్డి సహకారం.. సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్ చొరవతో గోవింద్ తండాకు తాగునీటి బోరు! ఎంపీ రఘురాం రెడ్డి సహకారం.. సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్ చొరవతో గోవింద్ తండాకు తాగునీటి బోరు!
    కారేపల్లి, నవంబర్ 5 (లోకల్ గైడ్ న్యూస్): గ్రామాభివృద్ధే లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మాదారం గ్రామ సర్పంచ్ అజ్మీర ఉమా
దివ్యాంగుల కోసం బస్ పాస్ మేళా.. 40 దరఖాస్తుల స్వీకరణ.
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే బీఎంఆర్ - కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం.
రాజీవ్ గృహకల్పలో ఆక్రమమాల తొలగింపు: జేసీబీలతో కూల్చివేసిన మున్సిపల్ సిబ్బంది
వికారాబాద్ జిల్లా లైబ్రరీ పార్కులో  స్వచ్ఛంద సేవ..
స్వామి వివేకానంద పార్కును పట్టిపీడిస్తున్న అలసత్వం: స్ఫూర్తిప్రదాత విగ్రహం వెనక చెత్తాచెదారం!
వికారాబాద్ బస్టాండ్‌లో మరుగుదొడ్లకు తాళం వేయడంపై స్పందించిన డిఎం నమ్రత