- District News
- Khammam
- ఎంపీ రఘురాం రెడ్డి సహకారం.. సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్ చొరవతో గోవింద్ తండాకు తాగునీటి బోరు!
ఎంపీ రఘురాం రెడ్డి సహకారం.. సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్ చొరవతో గోవింద్ తండాకు తాగునీటి బోరు!
రూ.90 వేల ఎంపీ నిధులు మంజూరు.. ముత్యాలమ్మ గుడి వద్ద బోరు ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ అధికారిక ఉత్తర్వులు
కారేపల్లి, నవంబర్ 5 (లోకల్ గైడ్ న్యూస్):
గ్రామాభివృద్ధే లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మాదారం గ్రామ సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్ కృషికి ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సహకారం తోడైంది. సింగరేణి మండలం మాదారం గ్రామపంచాయతీ పరిధిలోని గోవింద్ తండా ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.90 వేల ఎంపీ నిధులు మంజూరయ్యాయి. గోవింద్ తండాలోని ముత్యాలమ్మ గుడి వద్ద తాగునీటి బోరు ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే సంకల్పంతో సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్ నిరంతరం కృషి చేస్తున్నారు. గ్రామాలు, తండాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గోవింద్ తండాలో తాగునీటి అవసరాలను గుర్తించిన సర్పంచ్ ఉమా నరేష్ ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డిని కలిసి బోరు మంజూరు చేయాలని కోరారు. సర్పంచ్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ తన ఎంపీ నిధుల నుంచి రూ.90 వేలు కేటాయించారు. దీంతో ముత్యాలమ్మ గుడి వద్ద బోరు ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. గ్రామపంచాయతీ అభివృద్ధిలో భాగంగా ప్రజలకు తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా సర్పంచ్ ఉమా నరేష్ ముందుకు సాగుతున్నారు. ప్రతి తండాకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఆకాంక్షతో ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నారు. నిధుల కోసం ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను సంప్రదిస్తూ గ్రామ అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని సమకూర్చుకుంటున్నార.ఎంపీ రఘురాం రెడ్డి సహకారంతో గోవింద్ తండాకు తాగునీటి బోరు మంజూరు కావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ అభివృద్ధి పనులకు చొరవ చూపుతున్న సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్‌ను, సహకరించిన ఎంపీ రఘురాం రెడ్డిని స్థానికులు అభినందిస్తున్నారు. బోరు ఏర్పాటు పూర్తయితే గోవింద్ తండా ప్రజలకు తాగునీటి కష్టాలు గణనీయంగా తగ్గనున్నాయి.
